Team India: రంజీ ట్రోఫీ ఆడే టీమిండియా ప్లేయర్స్ జీతాలు ఎంతంటే ?
Team India: రంజీ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్ లలో టీమిండియాలోని పలువురు ప్రముఖ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. ఇందులో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శుభ్ మన్ గిల్ వంటి ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. ఈ టోర్నీలో ఆడడం ద్వారా ఈ ఆటగాళ్లు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ ఆటగాళ్లు తమ పాత ఫామ్ ను తిరిగి పొందడానికి ఇది ఎంతగానో సహాయం చేస్తుంది. అదే సమయంలో ఆర్థికంగా కూడా భారీగా డబ్బులను సంపాదిస్తారు. రంజి ట్రోఫీ రెండో రౌండ్ లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ముంబై తరపున ఆడుతున్నారు.
Ranji Players Salaries In India
కాగా, రిషబ్ పంత్ ఢిల్లీ జట్టులో భాగం కాగా, శుభ్ మన్ గిల్ పంజాబ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. జడ్డు తన సొంత జట్టు సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో ఆడే ఆటగాళ్ల కు బీసీసీఐ మూడు స్లాబ్ లలో జీతం ఇస్తుందని ఇది మ్యాచ్లు ఆడడం ఆధారంగా నిర్ణయించనుందని తెలుస్తుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 41 నుంచి 60 మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లకు రోజుకు రూ. 60,000 రంజీలో 4 రోజుల మ్యాచ్ ఆడినందుకుగాను రోహిత్ శర్మకు రూ. 2 లక్షల 40 వేలు అందుతాయి. రిజర్వ్ ఆటగాళ్లకు రోజుకు రూ. 30,000 ఇస్తామన్నారు.
21 నుంచి 40 మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లకు రోజుకు రూ. 50,000 అందుతాయి. అంటే నాలుగు రోజుల మ్యాచ్ ఆడిన తర్వాత ఆటగాడు రూ. 2 లక్షలు సంపాదిస్తాడు. రిజర్వ్ ప్లేయర్లకు ప్రతిరోజూ రూ. 25 వేలు లభిస్తుంది. ఇది కాకుండా, 0 నుంచి 20 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన ఆటగాళ్లకు నాలుగు రోజుల మ్యాచులు ఆడిన తర్వాత రూ. 1 లక్ష 60 వేలు. ఈ కేటగిరీలో చేర్చిన రిజర్వ్ ప్లేయర్లు ప్రతిరోజూ 20,000 పొందుతారు. దీని ప్రకారం… గిల్, రోహిత్, పంత్, జడేజా వంటి ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో నాలుగు రోజుల మ్యాచులు ఆడిన తర్వాత రూ 2.40 పొందుతారు. ఎందుకంటే వారందరూ 60 లేదా అంతకంటే ఎక్కువ ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు.