RAW NTR సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్ శనివారం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి తమపై వస్తున్న విమర్శలకు క్లారిటీ ఇచ్చారు. RAW NTR పేరు మీద చేస్తున్న అక్రమాల గురించి ప్రచారం జరుగుతుండగా, సాయి రూప్ తాము ఎన్టీఆర్ పేరును ఎప్పటికీ చెడగొట్టే పని చేయబోమని స్పష్టం చేశారు. సంస్థ ఊరు-వాడ సేవా ప్రాజెక్ట్ గురించి వివరించారు.
RAW NTR clarifies fake news
తమ సంస్థ మూడు విభాగాలతో పని చేస్తుందని సాయి రూప్ తెలిపారు. మొదటి విభాగం సేవతో యువ జాగృతి పేరుతో యువతను సమాజ సేవలో భాగస్వామి చేయడం. రెండవది మన ఊరు మన బాధ్యత ద్వారా గ్రామాల్లో సమస్యలను స్థానికుల సహకారంతో పరిష్కరించడం. మూడవది ఊరి మాట పాలకులు దాక ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
రైతుల కోసం ప్రత్యేక సదస్సులు నిర్వహించి వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు చేపడతామని సాయి రూప్ వివరించారు. గత వారంలో తమ సంస్థపై అసత్య ప్రచారాలు జరిగాయని, వంద కోట్ల మోసగాడు అని లేబుల్ వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ స్వయంగా చెబితే తప్ప తమ పనులు ఆపరమని సాయి రూప్ స్పష్టం చేశారు.
సేవ అంటే అన్నదానం, రక్తదానం మాత్రమే కాదని, ఎవరైనా సమాజానికి సహాయపడగలరని ఆయన అన్నారు. ఎన్టీఆర్ నటించిన విత్తనం వలే తాము సేవ చేస్తున్నామని, కానీ ఇప్పుడు తమను అవమానిస్తున్నారని సాయి రూప్ బాధపడ్డారు. మొత్తం మీద RAW NTR తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.





