జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలపై ఈ మధ్య చాలా చర్చ జరిగింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు స్పష్టమైన విషయం బయటికి వచ్చింది. junior ntr political entry update అనే ఈ విషయంపై ఆయన కార్యాలయం ఓ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో అన్ని రూమర్లకు చెక్ పెట్టారు.
junior ntr political entry update
తమిళనాడులో విజయ్ మెట్టుకున్న రూటు లాగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా ముందుగా సేవా సంస్థలు ఏర్పాటు చేసి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తారని కొన్ని విశ్లేషణలు వచ్చాయి. ఈ నెల 18న తిరుపతిలో ఓ హోటల్లో ప్రకటన ఉంటుందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఇవన్నీ పూర్తి తప్పని ఎన్టీఆర్ కార్యాలయం తేల్చి చెప్పింది. RAW NTR అనే సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ పేరుతో జరిగే కార్యక్రమాలకు తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ అభిమానులు సంయమనంతో ఉండాలని, ఆయన తరపున మాట్లాడే అధికారం ఎవరికీ లేదని ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ పేరు మీద ప్రకటనలు, కార్యక్రమాలు చేసే హక్కు కూడా ఎవరికీ లేదని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ విషయాలు అధికారిక బృందం ద్వారా లేదా వ్యక్తిగతంగా మాత్రమే వెలువడతాయని, ఇతర సమాచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రకటనలో చివరగా, ఈ అంశంపై ఇదే మా తుది వివరణ. దీనితో అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు ముగింపు పలుకుతున్నాం. సంప్రదాయ మీడియా, డిజిటల్ మరియు సోషల్ మీడియా వేదికలు, అలాగే అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రచారం చేయకుండా, అధికారిక సమాచారాన్నే విశ్వసించాలి అని కోరారు. ఇప్పుడు ఈ వార్తతో ఆ రూమర్లన్నీ తాత్కాలికంగా ఆగిపోయాయి.





