Onion: ముఖానికి ఉల్లిరసం రాస్తే…100 రోగాలకు చెక్ ?
Onion: మనలో చాలా మందికి ముఖం పైన నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, మొటిమలు ఉండడం చాలా సహజం. వాటిని తొలగించుకోవడానికి ఎన్నో రకాల మందులు, క్రీములు వాడుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల మచ్చలు, మొటిమలు తొలగిపోవడమే కాకుండా మరింత వికారంగా తయారవుతాము. దానివల్ల చిరాకు వస్తుంది. అందంగా లేము అని ఫీలింగ్ వస్తుంది. ముఖం పైన చిన్న మచ్చలు వచ్చిన మొటిమలు వచ్చిన ముఖ్యంగా ఆడవారు అస్సలు తట్టుకోలేరు. వాటిని తొలగించుకోవడానికి ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ మచ్చలు, మొటిమలు తొలగించడానికి ప్రయోగాలు చేస్తూ ఉంటారు.

Reasons Why You Should Include Onion In Your Beauty Routine
అలాంటి వాటిలో ఉల్లిపాయ రసం ఒకటి. కొంతమంది ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గించుకోవడానికి ఉల్లిపాయ రసాన్ని వాడుతూ ఉంటారు. అయితే కొంతమందికి ఉల్లి రసం అస్సలు పడదు. అది పెట్టినట్లయితే దురద, మంట పుడతాయి. దానివల్ల ముఖం చర్మం దెబ్బ తింటుంది. దద్దుర్లు ఏర్పడతాయి. ఉల్లిపాయ రసాన్ని మొఖం మీద రాయడం వల్ల కంటి సమస్యలు ఏర్పడతాయి. ఇన్ఫెక్షన్ అవుతుంది. కొంతమందికి ఉల్లిపాయ రసాన్ని వాడడం వల్ల అలర్జీ సమస్యలు కూడా వస్తాయి. అలాంటివారు ముఖంపై ఉల్లిపాయ రసాన్ని నేరుగా రాయడం మానుకోవాలి. ఇలా ఉల్లిపాయ రసాన్ని వాడేవారు వైద్యుని సలహాలు, లేదా దగ్గర్లో ఉన్న బ్యూటీషియన్ సలహాలు, సూచనల మేరకు మాత్రమే ఉల్లిపాయ రసాన్ని ముఖం మీద రాసుకోవాలి.
Bananas: ఎండా కాలం అరటి పండ్లు తింటున్నారా…?
ఉల్లి పాయ రసం ముఖంపై కన్నా జుట్టుకు చక్కగా పనిచేస్తుంది. జుట్టు పల్చగా ఉన్నవారు ఉల్లిపాయ రసాన్ని రాసినట్లయితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రు, దురద సమస్యలు ఉన్నవారు జుట్టుకు ఉల్లిపాయ రసాన్ని అప్లై చేసి అరగంట తర్వాత తల స్నానం చేసినట్లయితే జుట్టు బలంగా, ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేసినట్లయితే జుట్టు పెరగడం ఎవరు ఆపలేరు. ఇక కొంతమంది చిన్నపిల్లలకు కూడా ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టిస్తారు. అలాంటివారు చిన్నపిల్లలకు ఇలా చేయడం మానుకోవాలి ఉల్లిపాయ రసం పెట్టడం వల్ల చిన్న పిల్లలకి మంట పుడుతుంది. కంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందువల్ల ఉల్లిపాయ రసాన్ని పెద్దవారు మాత్రమే వాడాలి.