సంయుక్త మీనన్ హాట్ లుక్ తో మళ్ళీ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. లేటెస్ట్ ఫోటోలలో డీప్ రెడ్ సారీ గౌన్ లో ఆమె గ్లామర్ అదిరింది. ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన ఈ దుస్తులకు స్వీట్ హార్ట్ నెక్ లైన్ మరింత హాట్ టచ్ ని ఇచ్చింది. డైమండ్ నెక్ లెస్ మరియు ఇయర్ రింగ్స్ తో సంయుక్త క్లాసీగా మెరిసింది.
సంయుక్త ఈ ఏడాది తెలుగు, తమిళ, మలయాళం సినిమాలతో బిజీగా ఉంది. షూటింగ్ షెడ్యూల్స్ మధ్యలో కూడా అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోలు ఊహించినట్లుగానే వైరల్ అయ్యాయి. రెడ్ సారీ గౌన్ లో ఆమె పాజులు మెచ్చుకోదగ్గగా ఉన్నాయి.
స్లీక్ బన్ హెయిర్ స్టయిల్ తో ఆమె ఫోకస్ ను మొత్తం గౌన్ పైకి లాగింది. ట్రెడిషనల్ అండ్ మోడరన్ లుక్ ని బ్యాలెన్స్ చేస్తూ, సంయుక్త మరోసారి తన స్టయిల్ స్టేట్ మెంట్ ని నిరూపించుకుంది. ఒక్కో ఫోటోలో ఒక్కో వైవిధ్యం కనిపించింది.
సంయుక్త ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. సినిమాల్లో నటనతో పాటు, గ్లామర్ విషయంలో కూడా ఆమెకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె షేర్ చేసిన ప్రతీ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి, అభిమానుల నుండి అద్భుతమైన స్పందన పొందుతోంది.





