Political Red Signal అంటే ఏమిటో తెలుసా? తెలంగాణకు ఎంతో కీలకమైన బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఇప్పుడు రాజకీయంగానే ఆటంకాలు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, చెన్నై, ముంబై మధ్య మూడు బుల్లెట్ రైళ్ళను ప్రకటించింది. ఒకే రాష్ట్రానికి ఇన్ని బుల్లెట్ రైళ్ళు రావడం ఇదే మొదటిసారి. కానీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రకటన చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Political Red Signal: వివాదాలు పెరుగుతున్నాయి
సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ ప్రాజెక్టును రాజకీయాలకు అతీతంగా చూడాలని అంటున్నారు. ఫ్యూచర్ సిటీకి ఈ ప్రాజెక్టు బాగా ఉపయోగపడుతుందని ఆయన ఆశిస్తున్నారు. కానీ భూ సేకరణ విషయంలో పెద్ద సమస్యలు తలెత్తుతున్నాయి. భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తుండడంతో పోలీసులపై కొంతమంది దాడులకు కూడా దిగారు.
బహదూర్పురా ప్రాంతంలో పోలీసుల కళ్ళలో కారం చల్లడం, రాళ్ళు రువ్వడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల వెనుక ఏదో ఒక నేషనల్ పార్టీ నాయకుల ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు. స్థానిక నాయకులు కూడా ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ ఆందోళనలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో రాజకీయంగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇప్పుడు పోలీసులు కూడా ఆధారాలతో సహా ఇదే విషయాన్ని వెల్లడిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఈ ప్రాజెక్టు రాజకీయ రంగులో చిక్కుకుందేమో అనే అనుమానాలు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.





