Voter Card: ఓటు లేకుంటే సంక్షేమ పథకాలు కట్ – సీఎం రేవంత్ సంచలన ప్రకటన

సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓటర్ కార్డ్ లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఓటు లేనివారికి ప్రభుత్వం నుంచి లబ్ధి ఎలా అందిస్తామని ఆయన ప్రశ్నించారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉంచుకోవాలని, ఓటు వేయకుండా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Voter Card లేకుంటే పథకాలు కట్

ఓటర్ జాబితాలో పేరు లేనివారి విషయంలో ప్రభుత్వం తప్పకుండా పునరాలోచిస్తుందని సీఎం చెప్పారు. కేంద్రం కూడా ఇలాంటి నిబంధనలు అమలు చేస్తోందని, కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సంక్షేమ పథకాలు కట్ చేశారని వివరించారు. ప్రజలు తమ ఓటును భద్రంగా చూసుకోవాలి లేకుంటే ప్రభుత్వ లబ్ధి దూరమవుతుందని హెచ్చరించారు.

తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేసే వారిని వదిలి పెట్టనని, వారికి బొక్కలో వేయిస్తానని హెచ్చరించారు. తనకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని ఆరోపించే వారు వాటిని నిరూపించాలని సవాల్ చేశారు. ఇప్పటికే తన ఓటును బదిలీ చేసుకున్నట్లు, ఈ విషయాన్ని దాచి తనపై ఫిర్యాదు చేస్తున్నారని ఆరోపించారు.

నీట్ పేపర్ లీక్ విషయంలో విద్యార్థులు ఉద్యమిస్తున్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు నోరు ఎత్తడం లేదని సీఎం విమర్శించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతున్న సమయంలో బీఆర్ఎస్ మౌనంగా ఉండడం ఏమిటని నిలదీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరిగే ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు బూత్ లెవిల్ ఏజెంట్లు (BLA) నియమించామని తెలిపారు. వారు ఓటర్ల జాబితాను తారుమారు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటు లేకుండా ప్రభుత్వ పథకాలు ఆశించడం ఎలా సాధ్యమని సీఎం తేల్చి చెప్పారు.

Share your love