Rohit Sharma Retirement: రోహిత్‌ రిటైర్మెంట్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు!!

అప్పుడు నాకు ఇలానే చేశారు.. రోహిత్‌కు ఆ భావన కలిగించొద్దు: అశ్విన్ | రోహిత్ శర్మను అవాంఛనీయంగా భావించవద్దని రవిచంద్రన్ అశ్విన్ ఇండియా మేనేజ్‌మెంట్‌ను కోరారు, అతని రిటైర్మెంట్ నుండి పాఠాలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు

రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సీనియర్ ప్లేయర్లతో జట్టు వ్యవహరించిన తీరును అశ్విన్ ఘాటుగా విమర్శించాడు. తనకు జట్టులో అవసరం లేదనే ఫీలింగ్ రోహిత్ కు కలిగించడం సరికాదని అశ్విన్ అన్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఆటగాడు తన performance ను కూడా సరిగ్గా చూపించలేడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

Rohit Sharma Retirement Controversy

ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్ ల్లో విఫలమైన రోహిత్ ను 2027 ప్రపంచకప్ ప్లానింగ్ నుంచి తప్పించారని వార్తలు వచ్చాయి. లార్డ్స్ లో జరిగిన మూడో వన్డే రోహిత్ కు చివరి మ్యాచ్ అని కూడా ప్రచారం జరిగింది. కానీ BCCI ఈ వార్తలను ఖండించింది. రోహిత్ జట్టులోనే కొనసాగుతాడని స్పష్టం చేసింది.

అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ లో మాట్లాడుతూ ఈ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ సరైన నిర్ణయం తీసుకోలేదని అన్నాడు. రోహిత్ ను పక్కన పెట్టాల్సి వస్తే ఆ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయం తర్వాతే చెప్పాల్సిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. తనతో కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేసుకున్నాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయిన తర్వాత కూడా తనను పట్టించుకోలేదని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

సౌతాఫ్రికా వంటి ట్రాక్ ల్లో అనుభవం ఉన్న రోహిత్, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లు జట్టుకు చాలా అవసరమని అశ్విన్ అన్నారు. రోహిత్ ఫామ్ గత ఎనిమిది మ్యాచ్ ల్లో కాస్త తగ్గినా, ప్రపంచకప్ 2027 విజయం కోసం వారి అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. మెగా టోర్నీకి 12 నెలల ముందు వారిని పక్కన పెట్టడం సరికాదని అశ్విన్ ప్రశ్నించాడు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu