Spirit Movie: ఇంటర్నేషనల్ లెవెల్ కాస్టింగ్.. ‘స్పిరిట్’ లో డాన్ లీ పాత్ర పై క్లారిటీ!!
Spirit Movie: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “స్పిరిట్” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ నటించిన అన్ని చిత్రాలలోనూ ఇది ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ కాస్టింగ్ తో రూపొందించనున్న ఈ సినిమా, అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచుతోంది. మేకర్స్, ఈ చిత్రాన్ని గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని అత్యున్నత ప్రమాణాలతో రూపొందించబోతున్నారని సమాచారం.
Spirit Movie Don Lee Casting Rumors
తాజాగా, ఈ సినిమాలో కొరియన్ & బాలీవుడ్ యాక్టర్ డాన్ లీ కనిపించనున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాలీవుడ్ & కొరియన్ సినిమాల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డాన్ లీ, “స్పిరిట్” లో కీలక పాత్ర పోషించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రభాస్ పాన్-ఇండియా స్టార్ గా వెలుగొందుతున్న నేపథ్యంలో, స్పిరిట్ మూవీని కూడా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇక డాన్ లీ, ప్రభాస్ కలయిక తెరపై ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది. ఈ ఇంటర్నేషనల్ మాస్ కలయిక సినిమాకి కొత్త హైప్ తెచ్చేలా కనిపిస్తోంది. మరి, ఈ హై ఓక్టేన్ యాక్షన్ ఫిల్మ్ పై మరిన్ని అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.