SRH: ప్లే ఆఫ్ చేరాలంటే హైదరాబాద్ ఇలా చేయాల్సిందే?
SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. ఇవాళ రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. మొదటి మ్యాచ్లో లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య కూడా కీలక మ్యాచ్ జరగనుంది. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.

SRH Hyderabad has to do this to reach the playoffs
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇవాల్టి నుంచి ఐపీఎల్ లీగ్ దశ అయిపోయేసరికి… మొత్తం తొమ్మిది మ్యాచ్లు హైదరాబాద్ ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం ఏడు మ్యాచ్లు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి.
Nithya Menon: ఘాటు లిప్ లాక్స్..ఛీ ఛీ ఇది నిత్యా మీననేనా..?
ఇవాళ మ్యాచ్ ఓడిపోతే ఎనిమిది మ్యాచ్లో కచ్చితంగా 7 గెలవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అలా జరిగితే హైదరాబాద్ గెలవడం మరింత కష్టతరం అవుతుంది. కాబట్టి ఇవాల్టి నుంచి వరుసగా ఏడు మ్యాచ్లు గెలిచి… ప్లే ఆఫ్ లోకి వెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి పంజాబ్ కింగ్స్ పైన హైదరాబాద్ ఎలా ఆడుతుందో చూడాలి.
Ramyakrishna: ఆ హీరోయిన్ కి వ్యతిరేకంగా రమ్యకృష్ణ మూవీ.?