Spirit: స్పిరిట్ లో ప్రభాస్ కి జోడిగా స్టార్ హీరోయిన్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే.?
Spirit: తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయిలో పరిచయం చేసిన ఏకైక దర్శకుడు రాజమౌళి. ఈయన ఎదగడమే కాకుండా ఈయన చేతిలో పడ్డ ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ హీరోగా మారాడు. బాహుబలి ప్రాజెక్టుతో ప్రభాస్ పేరు అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్ని ఫ్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఒక రేంజ్ లో దూసుకుపోతున్నారు.
Star heroine opposite Prabhas in Spirit
అలాంటి ప్రభాస్ తో సినిమా అంటే ఏ నటుడి కైనా అదృష్టం ఉండాలి. అలాంటి ఆయన పక్కన హీరోయిన్ గా చేయడం అంటే ఇక అదృష్టం మామూలుది కాదు. ప్రభాస్ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టు స్పిరిట్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అభిమానులందరికి ఆత్రుతగా ఉంది. ఈ సినిమాలో ఎవరెవరు నటించబోతున్నారు.(Spirit)
Also Read: Sobhita: శోభిత గోరింటాకుకి వేణు స్వామికి మధ్య లింక్.. అదే నిజం కాబోతుందా.?
హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారనేది తెలుసుకోవడానికి ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ తరుణంలో హిందీ వెబ్సైట్స్ ద్వారా అందిన సమాచారం ప్రకారం స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ సరసన సీతారామమ్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ రాబోతున్నట్టు తెలుస్తోంది.
ఈయనే కాకుండా పలు కీలక పాత్రల్లో కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్ కూడా కనిపించబోతున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తప్ప అధికారికంగా మాత్రం ఫిక్స్ కాలేదు. దీనిపై డైరెక్టర్ సందీప్ వంగా స్పందిస్తే కానీ అసలు విషయం బయటకు వచ్చేట్టు కనిపించడం లేదు.(Spirit)