CM CHANDRABABU : ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్నికల నగరా మోగనుంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతోంది. రాబోయే ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఓ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఘనవిజయం కోసం ఇన్ఛార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, సమన్వయంపై ఎప్పటికప్పుడు స్పష్టతనిస్తామని.. ఏ ఎన్నిక జరిగినా కూటమి జెండా ఎగరడమే లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.
Elections of local bodies in AP soon.. Chandrababu’s key announcement
చివరగా 2021 మార్చిలో జరిగిన ఎన్నికల ద్వారా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ పాలకవర్గాలు కొలువుదీరాయి. స్థానిక సంస్థల ప్రతినిధుల పదవీ కాలం ఐదు సంవత్సరాలు. 2026 మార్చి - ఏప్రిల్ నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో.. గడువు ముగియక ముందే ఎన్నికలకు సిద్ధం కావాలని భావిస్తోంది ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే ఒక దారికి తీసుకువచ్చామని, 2026-27 ఆర్థిక సంవత్సరం రాష్ట్రాభివృద్ధికి ఓ కీలక మైలురాయిగా నిలవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
ALSO READ : TGSRTC : తెలంగాణ ఆర్టీసీ లో మోగిన సైరన్.. సమ్మె నోటీసులు అందజేత
పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మంత్రులు, కార్యదర్శుల పని తీరుపై ఏప్రిల్ 2న కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కేపీఐ లక్ష్యాల సాధన, దస్త్రాల పరిష్కారం, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చొరవ చూపిన అంశాల ఆధారంగా ఈ నివేదికలు ఉంటాయని తెలిపారు. మంత్రులు కేవలం సచివాలయానికే పరిమితం కాకుండా విరివిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
ALSO READ : CM REVANTH REDDY : వద్దంటే మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఆపేస్తా.. సీఎం రేవంత్ సెన్షేషన్ కామెంట్స్





