Sukumar: బోల్డ్ గా చేయమని హీరోయిన్ ని టార్చర్ చేసిన సుకుమార్.. బయటపడ్డ షాకింగ్ నిజం..?
Sukumar: సుకుమార్ నిజంగానే ఆ హీరోయిన్ ని బోల్డ్ గా నటించమని టార్చర్ చేశారా.. ఆయన నిజ స్వరూపం అదేనా.. ఇంతకీ సుకుమార్ టార్చర్ చేసిన ఆ హీరోయిన్ ఎవరయ్యా అనేది ఇప్పుడు చూద్దాం. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప-2 సినిమా ఎంత పెద్ద వివాదంలో ఇరుక్కుందో చెప్పనక్కర్లేదు. అయితే పుష్ప-2 సినిమా వివాదంలో ఇరుక్కోలేదు కానీ పుష్ప-2 సినిమా విడుదలైన సమయంలో బెనిఫిట్ షోని సంధ్య థియేటర్ కి చూడ్డానికి వచ్చిన అల్లు అర్జున్ కోసం అభిమానులు ఎగబడడంతో ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం ప్రస్తుతం పెద్ద వివాదాస్పదమయింది.
Sukumar who tortured the heroine to make her bold
ఆమె మృతికి కారణం అల్లు అర్జున్ అంటూ అల్లు అర్జున్ ని జైల్లో కూడా పెట్టారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పై కేసు నడుస్తోంది.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాపై ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ధ్వజమెత్తుతున్నారు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎర్రచందనం అమ్ముకునే వాడి గురించి స్మగ్లింగ్ చేసుకునే వాడి గురించి పెట్టి సినిమా తీస్తారా.. ఇక అలాంటివాడు హీరోనా.. అలాంటి హీరోకి నేషనల్ అవార్డులు కూడా ఇస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. (Sukumar)
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ 6వ ఇంట్లో శని..అందుకే ఈ వివాదాలు ?
అయితే తాజాగా ఈ విషయం గురించి సిపిఐ నారాయణ మాట్లాడుతూ.. సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలి కానీ ఇలా స్మగ్లింగ్ చేయడం, ఎర్రచందనం దొంగతనం చేసే వాడి గురించి సినిమాలు తీయడం ఆపేయాలి.. ప్రభుత్వాలు సినిమా టికెట్ల ధరలు పెంచితే బ్లాక్ మార్కెట్ ని వాళ్లే పెంచి పోషిస్తున్నట్టు.. ఇక పుష్ప టు సినిమాలో రష్మిక మందన్న పీలింగ్స్ అనే సాంగ్ ఆమెకి ఇష్టం లేకుండానే చేసింది.
కేవలం నిర్మాతలు, దర్శకుడు టార్చర్ వల్లే రష్మిక ఆ పాట చేయడానికి ఒప్పుకున్నట్టు పరోక్షంగా ఆమెనే చెప్పింది. ఇక ఇలాంటి మహిళలు చాలామంది ఆత్మాభిమానం చంపుకొని అలాంటి పాటల్లో నటిస్తారు. రష్మిక కూడా తన ఆత్మాభిమానం చంపుకొని ఆ సాంగ్ చేసింది అంటూ సిపిఐ నారాయణ సంచలన కామెంట్లు చేశారు. ఇక ఈయన మాటలు విన్న చాలా మంది నెటిజెన్లు సుకుమార్ రష్మికని పీలింగ్స్ సాంగ్ లో బోల్డ్ గా నటించమని టార్చర్ చేశారా ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Sukumar)