AMB Cinemas: AMB సినిమాస్ సహా 5 థియేటర్లపై భారీ జరిమానా ఎందుకంటే?
జీఎస్టీ తగ్గింపు తర్వాత కూడా టికెట్ గ్రాస్ రేట్ పెంచి అదనంగా వసూలు చేసినట్లు AMB సినిమాస్ సహా మరో ఐదు థియేటర్లపై GSTAT జరిమానా విధించింది. మొత్తం రూ.1.7 కోట్లలో భాగస్వామ్యంగా వివిధ మొత్తాలు, 18% వడ్డీతో సహా సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశించింది.