Thammudu movie: మళ్ళీ వరుస ఫ్లాప్ లలో నితిన్.. ‘తమ్ముడు’ పైనే ఆశలు.. లేదంటే అంతే!

Thammudu movie: నితిన్ నటించిన ‘రాబిన్ హుడ్’ చిత్రం ఆయనపై పెట్టుకున్న ఆశలను పూర్తి చేయలేకపోయింది. గతంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ వంటి హిట్ తరువాత మరో బ్లాక్‌బస్టర్ కొడతాడన్న ఆశలు ఉండగా, రాబిన్ హుడ్ కూడా ‘ఎక్స్‌ట్రాడినరీ మ్యాన్’లా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. వరుస ఫెయిల్యూర్స్‌తో నితిన్ కెరీర్ ఒక మలుపులో నిలిచిపోయినట్టైంది.
Thammudu movie brings Nithiin hope
ఈ నేపథ్యంలో నితిన్ ప్రస్తుతం దర్శకుడు వేణు శ్రీరామ్‌తో కలిసి ‘తమ్ముడు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. టైటిల్ చూస్తేనే ఇది ఒక భావోద్వేగ చిత్రమని అర్థమవుతుంది. ఇందులో ఓపినింగ్ సీన్స్ నుంచే ఎమోషనల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం. అలాగే, ఒకప్పుడు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన హీరోయిన్ లయ కీలక పాత్రలో కనిపించనున్నారు.
నితిన్, లయ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చిత్రయూనిట్ చెబుతోంది. సెంటిమెంట్, ఎమోషన్ కలగలసిన ఈ చిత్రం నితిన్‌కు మళ్లీ హిట్ అందిస్తుందనే నమ్మకం ఉంది. దిల్ రాజు నిర్మించిన గత సినిమాల్లోనూ నితిన్‌కు మంచి బ్రేక్‌లు వచ్చాయని పరిశ్రమలో విశ్వాసం ఉంది.
తమ్ముడు తర్వాత నితిన్ ‘ఎల్లమ్మ’ అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి డైరెక్ట్ చేయనున్నారు. ‘ఎల్లమ్మ’ మూవీ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. కొత్త కథాంశంతో వస్తున్న ఈ రెండు సినిమాలు నితిన్‌కు మళ్లీ గెలుపు తాలూకు మార్గాన్ని చూపుతాయేమో చూడాలి.