Bahubali: ప్రభాస్ కాదు.. బాహుబలి చేయాల్సింది ఆ హీరో.. కానీ ఎక్కడ చెడిందంటే.?

Bahubali: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అంటే దానికి ఒకే ఒక్క కారణం దర్శకుడు రాజమౌళి. రాజమౌళి చేసిన బహుబలి సినిమా వల్లే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకొని తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు.రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఏ సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ నమోదు చేసుకున్నవే..
That hero should have done Bahubali but
అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు రాజమౌళి ప్రభాస్ లకు పేరు తెచ్చిన మూవీ బాహుబలి..అయితే ఈ సినిమాలో ఫస్ట్ ఆప్షన్ గా తీసుకోవాల్సిన హీరో ప్రభాస్ కాదట వేరే హీరోని అనుకున్నారట. బాహుబలి పాత్రలో మొదట ఓ తమిళ హీరోని అనుకున్నారట దర్శకుడు రాజమౌళి. ఆ హీరోకి రాజమౌళి కథ కూడా చెప్పారట.కానీ ఆ హీరో రిజెక్ట్ చేయడంతో అది ప్రభాస్ చేతిలోకి వచ్చిందట.(Bahubali)
Also Read: Allu Arjun: ఆ హీరో మీద అసూయ పడ్డ అల్లు అర్జున్..?
ఇక బాహుబలి వంటి భారీ పాన్ ఇండియా మూవీని వదులుకున్న హీరో ఎవరో కాదు తమిళ నటుడు సూర్య. రాజమౌళి మొదట బాహుబలి మూవీని సూర్యతో చేయాలి అని సూర్యకి కథ చెప్పారట.కానీ కథ మొత్తం విన్న సూర్య ఈ కథ,పాత్ర వింటుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి.కానీ మీరు అనుకుంటున్న కథకి,పాత్రకి నేను అస్సలు సెట్ అవ్వను.

మీరు అనుకుంటున్న పాత్రకి తగ్గట్టుగా ఉండే కటౌట్ ఉండే హీరోని వెతుక్కొని ఆ హీరోతో ఈ సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది.కానీ నాకు ఈ సినిమా సెట్ అవ్వదు అని సూర్య రిజెక్ట్ చేశారట. అలా సూర్య రిజెక్ట్ చేయడంతో చివరికి ఈ సినిమా ప్రభాస్ కి వచ్చి బాహుబలి అంటే ప్రభాస్.. ప్రభాస్ అంటే బాహుబలి.. అనేంతలా హిట్ అయింది.(Bahubali)