Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ కి సైఫ్ పై జరిగిన కత్తి దాడికి మధ్య సంబంధం.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..?
Allu Arjun: సాధారణంగా ఒక హీరో స్టార్ డం పొందాడు అంటే ఆయనకు ఎంతో సెక్యూరిటీ ఉంటుంది.. ఆయన బయటకు వెళ్తున్నారు అంటే తప్పక సెక్యూరిటీ సిబ్బంది ముందుగానే ఆ ప్రాంతమంతా అలర్ట్ చేస్తుంది.. అంతేకాకుండా అలాంటి పెద్ద పెద్ద స్టార్ల ఇంట్లో మరియు చుట్టుపక్కల ఏరియాల్లో నిఘా నేత్రాలు కట్టుదిట్టంగా ఉంటాయి.. అంతేకాకుండా సెక్యూరిటీ సిబ్బంది కూడా గట్టిగానే ఉంటుంది.. అంతటి భద్రత నడుమ కూడా దుండగులు దాడులు చేయడం మాత్రం ఆగడం లేదు..

The relationship between Allu Arjun remuneration and the knife attack on Saif
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ పై ఒక దుండగుడు కత్తితో దాడి చేసి చాలా గాయపరిచాడు.. ఆ వ్యక్తి దాడి చేసింది కూడా సైఫ్ అలీఖాన్ ఇంట్లోనే.. ఇంతటి దుశ్చర్యకు పాల్పడినా కానీ అసలు దాడి చేసిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పటివరకు కూడా కనిపెట్టలేదు.. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఆయనపై దాడి చేయలేదని విమర్శలు వస్తున్నాయి.. అంతేకాకుండా అంత పెద్ద ఖరీదైనటువంటి గల్లీలో ఉండేటువంటి సైప్ అలీ ఖాన్ ఇంట్లో సెక్యూరిటీ ఎందుకు లేదని చర్చ కూడా సాగుతోంది. (Allu Arjun)
Also Read: Tollywood: పొదల చాటుకు తీసుకెళ్లి రే** చేశాడు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్.?
ఇదే తరుణంలో ఆ విషయంపై రీసెంట్ గా బాలీవుడ్ దర్శకనిర్మాత ఆకాశ్ దీప్ సబీర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కోట్ల రూపాయల రెమ్యుననేషన్ తీసుకుంటున్న కానీ ఇంటి ముందు సెక్యూరిటీ నియమించుకోలేకపోయిందని అన్నారు.. మరి వీరికి కూడా అల్లు అర్జున్ కు ఇచ్చినట్టు 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తే సెక్యూరిటీని పెట్టుకుంటారేమో.. కరీనా నాకు చిన్నప్పటినుంచి తెలుసు..

ఆమె మొదటి సినిమాకు నేను దర్శకనిర్మాతగా కూడా పని చేశాను.. ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలో వీళ్ళు కూడా ఒకరు.. అలాంటి వీరి ఇంట్లో సెక్యూరిటీ లేకపోవడం అనేది నాకు ఎంతో అనుమానం కలిగిస్తోంది.. అంతేకాదు కొంతమంది వ్యక్తులు వాళ్ళింట్లో ఫుల్ టైం సెక్యూరిటీ, డ్రైవర్లు ఎందుకు లేరు అని నన్ను ప్రశ్నించినప్పుడు సమాధానం కూడా లేకపోయిందని చెప్పుకొచ్చాడు.. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Allu Arjun)