Venu Swamy: నన్ను కెలికినందుకే టాలీవుడ్ సర్వనాశం.. ఇంకా అనుభవిస్తారు..?

Venu Swamy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోకు ఎలాంటి పేరు ఉంటుందో ఆ విధంగా పేరు సంపాదించుకున్నారు వేణుస్వామి.. అలా అని ఈయన ఏం సినిమాల్లో హీరోగా కానీ ఏదైనా పాత్రలో కానీ చేయలేదు. కేవలం రాజకీయ నాయకులు, స్టార్ సినీ నటుల జాతకాలు చెప్పుకుంటూ ఫేమస్ అయిపోయారు. అలాంటి వేణు స్వామి చెప్పినటువంటి చాలా విషయాలు ఇండస్ట్రీలో జరిగాయి. కానీ కొన్ని విషయాల్లో ఈయన చెప్పిన దానికి రివర్స్ అయింది దీంతో చాలా విమర్శలు పాలు అయ్యారు వేణుస్వామి.

Tollywood is destroyed because of teasing me Venu Swamy comments viral

Tollywood is destroyed because of teasing me Venu Swamy comments viral

అయితే ఏపీలో జగన్ గెలుస్తాడని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తాడని చెప్పాడు. కానీ దానికి రివర్స్ అవ్వడంతో వేణు స్వామి తీవ్రమైన విమర్శల పాలయ్యాడు. దీంతో ఆయన నేను ఇక జాతకాలు చెప్పను అంటూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి పలు సంచలనమైన కామెంట్స్ చేశారు.. ఆ వివరాలు ఏంటో చూద్దామా.. (Venu Swamy)

Also Read: Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి వింత డిమాండ్.. నిర్మాతలను పిండేస్తుందిగా..?

మొన్నటికి మొన్న నాగచైతన్య శోభిత ధూళిపాల వివాహంతో ఒకటైన సందర్భంగా లైఫ్ లో జరిగే సంఘటన గురించి వారి జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. దీంతో అక్కినేని అభిమానులంతా ఆయన పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. అంతేకాకుండా కొంతమంది మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు.. అలా కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్న వేణుస్వామి తాజాగా మరోసారి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా అతలాకుతరమవుతుందని అప్పట్లోనే చెప్పాను..

Tollywood is destroyed because of teasing me Venu Swamy comments viral

ఒక పెద్ద హీరో కన్వెన్షన్ కూల్చివేశారు, సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి ఆ నటుడు ఇంట్లో గొడవలు, అలాగే పాన్ ఇండియా హీరోను జైల్లో వేయడం, అంతేకాకుండా ఇండియాకు పెద్ద పేరు తెచ్చిన డైరెక్టర్ ను టార్చర్ చేయడం ఇలా ఈ నాలుగు సంఘటనలు జరుగుతాయని నేను అప్పట్లోనే చెప్పాను ప్రస్తుతం ఇండస్ట్రీలో అవే జరుగుతున్నాయి.. ఇవే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకా మరిన్ని గింగిరాలు తిరుగుతుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు.(Venu Swamy)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *