Tollywood Senior Heroes: టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న సీనియర్ హీరోలు.. ఇండస్ట్రీ హిట్స్.. రికార్డుల యాత్ర!!


Tollywood Senior Heroes Dominate Box Office

Tollywood Senior Heroes: టాలీవుడ్‌లో సీనియర్ హీరోలు మరోసారి తమ సత్తా చాటుతున్నారు. వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణలు వరుసగా హిట్ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తున్నారు. ఇద్దరు వంద కోట్ల క్లబ్‌లో హవా చూపిస్తుండగా, వెంకటేష్ 300 కోట్ల మార్క్ దాటేశారు. ఈ జాబితాలో నాగార్జున మాత్రమే సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

tollywood senior heroes, venkatesh box office, chiranjeevi 200 crores, balakrishna latest hit, nagarjuna comeback film, tollywood highest grosser, venkatesh latest movie, chiranjeevi industry hit, balakrishna box office, tollywood sankranti releases, venkatesh 300 crores, senior actors tollywood, tollywood mass films, tollywood record breakers, senior heroes comeback



తాజాగా సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వెంకటేష్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సీనియర్ హీరోలలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రికార్డును వెంకటేష్ పేరిట లిఖించుకుంది. ఇప్పటి వరకు 200 కోట్ల మార్క్ దాటిన సినిమాలు ఉన్నా, 300 కోట్ల గ్రాస్ సాధించిన సినిమా ఆయనదే.

ఇక చిరంజీవి, బాలకృష్ణలు వరుస బ్లాక్‌బస్టర్స్‌తో జోరు చూపిస్తున్నారు. ‘ఖైదీ నెం. 150’, ‘సైరా’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో చిరు 200 కోట్ల గ్రాస్ అందుకున్నారు. అదే విధంగా బాలకృష్ణ ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు’ సినిమాలతో 100 కోట్ల గ్రాస్ సాధించి స్ట్రాంగ్ ఫామ్‌లో ఉన్నారు.

ఈ ముగ్గురు హీరోలు టాలీవుడ్‌లో రికార్డులు తిరగరాస్తుండగా, నాగార్జున మాత్రం సరైన మాస్ కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఆయన నుంచి మాస్ ఎంటర్టైనర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరైన సినిమా వస్తే నాగ్ కూడా తన సత్తా చాటడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *