Tollywood Star Heroes: టాలీవుడ్ పాన్ ఇండియా హీరోల నయా మాత్రం.. ప్రభాస్ లాగా వర్కౌట్ అయ్యేనా?


Tollywood Star Heroes Movie Speed Race

Tollywood Star Heroes: టాలీవుడ్ లో చాలామంది మంది టాప్ యాక్టర్స్ ఒక సినిమాకు రెండు సంవత్సరాల సమయం కేటాయిస్తున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం పాన్ ఇండియా మార్కెట్ విస్తరించడం, బడ్జెట్, వర్కింగ్ డేస్ పెరగడమే. ఈ నేపథ్యంలో, ఏడాదికి రెండు సినిమాలు చేయడం అంటే అసాధ్యంగా మారింది. అయితే, పాన్ ఇండియన్ హీరోలలో ప్రభాస్ మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ముందంజలో ఉన్నాడు.

Tollywood Star Heroes Movie Speed Race

ఈ ఏడాది “రాజా సాబ్” విడుదలకు సిద్ధంగా ఉండగా, హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా కూడా తక్కువ గ్యాప్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అదనంగా, “సలార్ 2,” “కల్కి 2,” “స్పిరిట్” వంటి హైబజ్ ప్రాజెక్ట్స్ ఈ రెండు సంవత్సరాల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రభాస్ చేస్తున్న స్పీడ్‌ని చూస్తూ మిగిలిన టాలీవుడ్ హీరోలు కూడా ఫాస్ట్ పేస్ లో సినిమాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు.

రామ్ చరణ్ తన “గేమ్ ఛేంజర్” కోసం మూడు సంవత్సరాలు వెచ్చించాడు, కానీ బుచ్చిబాబు ప్రాజెక్ట్‌ను 6 నెలల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. డిసెంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అదే విధంగా, ఎన్టీఆర్ “వార్ 2” కోసం ఆగస్టు 14 రీలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా, “దేవర 2” ప్రాజెక్ట్‌లు కూడా లైన్‌లో ఉన్నాయి.

ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ సినిమా కోసం రెండేళ్లు కేటాయించాడు. కానీ సీనియర్ హీరో బాలకృష్ణ మాత్రం ప్రతి ఏడాదికి రెండు సినిమాలు చేయాలనే లక్ష్యంతో దూసుకెళ్తున్నాడు. మరి, ఈ రేస్‌లో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎవరు ఫాస్ట్‌గా సినిమాల చేస్తూ ముందుకెళ్తారు? వేచి చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *