వేతనాల పెంపు కోసం కార్మికులు చేపట్టిన సమ్మెకు శుభం కార్డు పడింది. సినీ కార్మిక సంఘాలు, నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దల మధ్య జరుగుతున్న చర్చల్లోకి ప్రభుత్వ అధికారులు కూడా జోక్యం చేసుకోవడంతో సమ్మె సమస్య పరిష్కారమైంది. నిన్న లేబర్ కమిషనర్, నిర్మాతలు, సినీ కార్మికుల మధ్య జరిగిన సంప్రదింపుల తర్వాత 22.5 శాతం వేతనాలను పలు దఫాలుగా పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారు.
ఏడాదికి కొంత చొప్పున ఈ పెంపు ఉండనుంది. మొదటి ఏడాది 12.5 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంచనున్నారు. దీంతో కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. మరికొన్ని పెండింగ్ లో ఉన్న డిమాండ్స్ కూడా త్వరలో పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. దాదాపు 20 రోజులుగా సాగిన సమ్మెకు దీంతో పుల్ స్టాప్ పడింది. నేటి నుంచి యధావిధిగా షూటింగ్స్ జరగనున్నాయి.





