Korean Kanakaraju: పెదనాన్న చిరంజీవి స్ఫూర్తితో వరుణ్ డ్యాన్స్

మెగా ఫ్యామిలీ నుంచి మరో సరదా సినిమా వచ్చేస్తోంది. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం Korean Kanakaraju ఒక ఫన్నీ హారర్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని, రిలీజ్‌కు రెడీ అవుతోంది. మూవీ టీం ఇప్పుడు ప్రమోషన్‌లో బిజీగా ఉంది, లేటెస్ట్‌గా అనంతపురంలో జరిగిన ఒక ఈవెంట్‌లో సినిమాలోని మాస్ సాంగ్‌ను లాంచ్ చేశారు.

Varun Tej Korean Kanakaraju Mass Song

ఈ కార్యక్రమం ఆదివారం అనంతపురంలో చాలా ఘనంగా జరిగింది. ‘రాసా ఏపీ’ అనే ఈ కొత్త పాటకు తమన్ సంగీతం అందించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం రాశారు. నల్గొండ గద్దర్ గొంతు ఈ పాటకు ప్రాణం పోసింది. పాటలో వరుణ్ తేజ్‌తో పాటు దక్ష నగర్కర్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. వీళ్ల కెమిస్ట్రీ, గ్లామరస్ లుక్ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. పాట మొత్తం మాస్ ఆడియన్స్‌ను టార్గెట్‌గా చేసుకుని, లోకల్ ఫ్లేవర్‌తో రూపొందింది.

ఈ ఈవెంట్‌లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ తన డ్యాన్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. “ఈ పాటకు స్టెప్పులు వేసేటప్పుడు నా పెదనాన్న, మెగాస్టార్ చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకున్న. ఆయన ఎనర్జీ, డ్యాన్స్ స్టయిల్ నాకు చాలా ఇన్స్పిరేషన్ అని” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడ కూడా డ్యాన్స్ చేసి షో చేయాలని ఉంది కానీ, దురదృష్టవశాత్తు కాలికి ఇటీవలే స్వల్ప గాయం అయిందని, అందుకే వీలు కావడం లేదని వివరించాడు. సినిమా మొత్తం ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తుందని హామీ ఇచ్చాడు.

దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ, ఈ చిత్రంలో కమర్షియల్ హంగులన్నీ పుష్కలంగా ఉంటాయని చెప్పాడు. ఇది కేవలం హారర్ కామెడీ మాత్రమే కాదు, మాస్ ప్రేక్షకులను థియేటర్‌లో ఈలలు వేయించే పక్కా ఎలిమెంట్స్‌తో నిండి ఉంటుందని వివరించాడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను నిర్మాత రాజీవ్ రెడ్డి సమర్పిస్తున్నారు. అనంతపురం యూడా చైర్మన్ వరుణ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. Korean Kanakaraju మూవీ ఆగస్ట్ 7న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu