Venu Swamy: ఆ పొలిటీషియన్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం ఖాయం.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.?

Venu Swamy: సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఒక స్టార్ హీరోకి ఉండేటువంటి పేరును సంపాదించుకున్నారు వేణుస్వామి..సాధారణంగా వ్యక్తుల జాతకాలు చెబితే ఆయనకు పెద్దగా పాపులారిటీ ఉండేది కాదు కానీ, ఎప్పుడైతే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల జాతకాలు చెప్పారో అప్పటినుంచి వేణుస్వామి పేరు చాలా బ్రాడ్ గా వినిపిస్తోంది. ఆయన చెప్పిన వాటిలో కొన్ని విషయాలు నిజమవ్వడంతో ఇక వేణు స్వామిని కలవడానికి ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు వచ్చి పూజలు చేయించుకొని వారి భవిష్యత్తును నిర్ణయించుకున్నారు.
Venu Swamy shocking comments
అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రష్మిక మందన. ఈమె వేణు స్వామితో పూజలు చేసుకున్న తర్వాతే కెరియర్ గాడిలో పడి స్టార్ హీరోయిన్ గా మారింది. రష్మిక తర్వాత ఎంతో మంది హీరోయిన్లు వేణుస్వామి వద్దకు పరుగులు తీశారు. అలా కొన్నాళ్లపాటు జాతకాలతో చాలా పాపులారిటీ సంపాదించారు వేణుస్వామి. అంతేకాకుండా ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ఫెయిల్యూర్ ఉంటుందని చెప్పారు. ఆయన అన్నట్టుగానే బాహుబలి తర్వాత వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి..(Venu Swamy)
Also Read: Prabhas: బాలకృష్ణతో ప్రభాస్ కి గొడవలు.. తప్పంతా ఆయనదేనా.?
ఇక ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల్లో విజయం సాధిస్తారని చెప్పారు. కానీ ఇది బోల్తా కొట్టి అనూహ్యంగా ఏపీలో చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించడంతో వేణు స్వామి చెప్పిన జాతకాలు అన్ని రివర్స్ అయిపోయాయి.. ఆ విధంగా వేణుస్వామి కాస్త డల్ అయిపోయి కొన్నాళ్ళ పాటు సైలెంట్ గా ఉండి ఈ మధ్యకాలంలో మళ్లీ పలువురు స్టార్ల జాతకాలు చెబుతూ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అయితే ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటారు.

ఆ హీరో తన భార్యకు విడాకులు కూడా ఇస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరయ్యా అంటే తమిళ స్టార్ దళపతి విజయ్..ఈయన ఈ మధ్యకాలంలోనే ఒక పార్టీ పెట్టారు..అయితే విజయ్ తన భార్యకు విడాకులు ఇస్తాడని త్రిష కు దగ్గరయిపోయి ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడని ఆయన చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం వేణుస్వామి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..(Venu Swamy)