Kingdom Release: విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే చాలు.. బ్యాచ్ లు రెడీ అయిపోతాయేంటో!!

Kingdom Release: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం వరుసగా మూడు క్రేజీ సినిమాలతో తెలుగు సినీప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన తాజా యాక్షన్ డ్రామా చిత్రం ‘కింగ్‌డమ్’ (Kingdom) గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోంది. ‘జెర్సీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గౌతమ్ Vijay తో తొలిసారి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, కేరళ, శ్రీలంక లాంటి లొకేషన్స్‌లో జరిపిన షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.
Vijay Deverakonda Kingdom Release Update
ఇటీవల రిలీజ్ అయిన టీజర్ సినిమాపై భారీ హైప్ (Hype) క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ న్యూ మేకోవర్ (New Makeover), క్యారెక్టరైజేషన్ (Characterization) అభిమానులను ఆకట్టుకున్నాయి. యాక్షన్, ఎమోషన్, సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే, మే 30న విడుదల చేయాలని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే ‘కింగ్‌డమ్’ రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ వార్తతో విజయ్ అభిమానులు కొద్దిగా నిరాశకు గురవుతున్నారు. indi పుకారు మాత్రమే.
కానీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం తెగ రుద్దేస్తున్నారు. ఆదిలోనే ఈ సినిమా పై నెగెటివ్ చేయడానికి చూస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ వంటి సినిమాలతో గుర్తింపు పొందిన డైరెక్టర్ రాహుల్ సంకీర్త్యన్ తో విజయ్ ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా (Periodic Action Drama) చేస్తున్నాడు. ఈ సినిమా కథ, బడ్జెట్, విజువల్స్ అన్నీ విభిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. ఇదే కాకుండా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన్ (Rowdy Janardhan) అనే సినిమాకు కూడా విజయ్ ఓకే చెప్పాడు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు.
ఈ మూడు సినిమాలపైనా టాలీవుడ్‌లో భారీ ఆసక్తి నెలకొంది. ఒకవైపు కథానాయకుడిగా తన పరిమితులను విస్తరిస్తూ, మరొకవైపు స్టైలిష్ మేకోవర్స్‌తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ విజయ్ దేవరకొండ తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా పయనిస్తున్నాడు. ‘కింగ్‌డమ్’ విడుదల తేదీ లో మార్పు లేదని టీం నుంచి వస్తున్న వార్తలను బట్టి తెలుస్తుంది. మరి ఈ సినిమా తో విజయ్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.