RBI And Two Other Banks Received Bomb Threat Email Demanding Shaktikanta Das & Nirmala Sitharaman to Resign

Bomb Threat Email: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్‌లపై బాంబులు వేస్తామని సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపు మెయిల్ హెచ్చరించింది. బెదిరింపు ఇమెయిల్ పంపిన వ్యక్తి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.

మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముంబైలోని 11 చోట్ల 11 బాంబు దాడులకు పాల్పడుతామాంటూ బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఈమెయిల్‌లో పేర్కొన్న ప్రాంతానికి వెళ్లి విచారించగా అక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పోలీసులు తెలిపారు. బెదిరింపు ఇమెయిల్ ID Khilafat.India@Gmail.com నుండి వచ్చింది. ముంబైలోని ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Also Read: Atal Pesion Yojana: రోజుకు రూ. 7 ఆదా చేస్తే నెల‌కు రూ. 5 వేలు పెన్ష‌న్‌.. పూర్తి వివ‌రాలు మీకోసం!

ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఆర్బీఐ కలిసి భారత చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి తెర తీశాయని ఈ ఈమెయిల్‌లో పేర్కొన్నారు దుండగులు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కొందరు సీనియర్ బ్యాంకు అధికారులు, మంత్రులకు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఈ ఇమెయిల్ తెలియజేస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తమ పదవులకు రాజీనామా చేసి స్కామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించాలని కోరినట్లు సమాచారం.

RBI And Two Other Banks Received Bomb Threat Demanding Shaktikanta Das & Nirmala Sitharaman to Resign

ఆర్థిక మంత్రి మరియు ప్రొవిన్షియల్ గవర్నర్ మరియు పాల్గొన్న వారందరికీ తగిన శిక్షలు విధించాలని వారు కోరినట్లు తెలుస్తోంది. (Bomb Threat Email)

Join WhatsApp