Virat Kohli: 30 బంతుల్లో 31… విరాట్ కోహ్లీ ట్రోలింగ్?
Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… విరాట్ కోహ్లీ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ను టెస్ట్ మ్యాచ్ లగా విరాట్ కోహ్లీ ఆడుతున్నాడని సోషల్ మీడియాలో… సెటైర్లు పేల్చుతున్నారు. తాజాగా… చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య… బిగ్ ఫైట్ జరిగింది.

Virat Kohli batting on csk vs rcb match
చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ దారుణంగా ఆడాడు. 30 బంతుల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు విరాట్ కోహ్లీ. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఓపెనర్ గా… బర్లోకి దిగిన విరాట్ కోహ్లీ ఎక్కువ బంతులు ఆడి 30 పరుగులు మాత్రమే చేయడంపై… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. టి20 లో టెస్ట్ ప్లేయర్ లాగా ఆడుతున్నాడని మండిపడుతున్నారు కొంతమంది అభిమానులు.
Harish Rao: తెలంగాణ అప్పుల చిట్టా బయటపెట్టిన హరీష్ రావు ?
అయితే చెన్నై ma చిదంబరం స్టేడియం కఠినంగా ఉందని.. అందుకే విరాట్ కోహ్లీ కాస్త ఆడినట్లు కొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై మాత్రం విమర్శలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై 50 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది.
Revanth Reddy: మరో 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీదే అధికారం