Vishwak Sen: నా లేడీ ఫోటో దానికి వాడకండి.. పచ్చిగా మాట్లాడిన విశ్వక్ సేన్..?
Vishwak Sen: యంగ్ హీరో గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విశ్వక్ సేన్ గత ఏడాది మెకానిక్ రాఖి మూవీ తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాడు. కానీ ఈ ఏడాది మాత్రం ఆ సినిమా రిజల్ట్ రిపీట్ కాకుండా లైలా అనే కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారు. లైలా మూవీ లో విశ్వక్ సేన్ అమ్మాయి గెటప్ లో కూడా కనిపిస్తారు.
Vishwak Sen: Dont use my lady photo for that
రామ్ నారాయణ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా సాహు గారపాటి నిర్మాతగా చేస్తున్న లైలా మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజు సందర్బంగా విడుదల కాబోతుంది. అయితే రీసెంట్ గా ఈ సినిమా నుండి టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ సాంగ్ రిలీజ్ చేశారు.. (Vishwak Sen)
Also Read: Siddhu Jonnalagadda: ఆ దర్శకుడికి సిద్ధు జొన్నలగడ్డ గ్రీన్ సిగ్నల్.. క్రేజీ కాంబినేషన్!!
ఇక ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలో విశ్వక్సేన్ లేడీ గెటప్ లో కనిపిస్తారు.కాబట్టి స్టేజ్ పై లేడీ గెటప్ గురించి మాట్లాడుతూ.. సినిమాలో ఉన్న నా లేడీ గెటప్ ని కేవలం ఫోటో చూసి వదిలేయండి. దానికోసం అస్సలు వాడకండి అంటూ బోల్డ్ కామెంట్లు చేశారు.అయితే దాని కోసం వాడకండి అనగానే అందరికీ అర్థం అయిపోయింది.
దీంతో విశ్వక్సేన్ ఏంటి మరీ ఇంత బోల్డ్ గా మాట్లాడారు అంటూ హీరో మాటలు నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. నా ఫోటో జస్ట్ చూసి వదిలేయండి నా లేడీ గెటప్ ఎంత బాగున్నా కూడా జస్ట్ చూసి అలా వదిలేయండి దానికోసం వాడకండి అంటూ విశ్వక్సేన్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఆ ఈవెంట్ లో విశ్వక్ సేన్ ఏం మాట్లాడారో మీరు కూడా ఒకసారి చూసేయండి.(Vishwak Sen)