Walking: వాకింగ్ చేసేవాళ్ళు జాగ్రత్త.. ఈ రూల్స్ పాటించండి !
Walking: ఉదయాన్నే చాలా మందికి వాకింగ్ కు వెళ్లే అలవాటు ఉంటుంది. అయితే కడుపులో ఏమీ లేకుండా పరగడుపున ఇలా వాకింగ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. చాలామందికి ఉదయాన్నే వాకింగ్ కు వెళితే చాలా సన్నబడతామని, ఆరోగ్యంగా ఉంటామని నమ్మకంతో వాకింగ్ కు వెళ్లడానికి ఇష్టపడతారు. వాకింగ్ చేయడం నిజంగానే ఆరోగ్యానికి చాలా మంచిది. వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారు వాకింగ్ కు వెళ్లడం చాలా మంచిది. వాకింగ్ కు వెళితే కొన్ని రోజులలో చాలా మార్పులు వస్తాయి. సూర్య రష్మి నుంచి విటమిన్-డి శరీరానికి అందుతుంది. ఇది ఎముకలను బలంగా తయారు చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

walking benefits for humans
అంతే కాకుండా శరీరంలో ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గుండె ఆరోగ్యం, పనితీరును మెరుగుపరుస్తుంది. రక్త పోటు నియంత్రణకు ఇది చక్కని మార్గం. ఈ అలవాటు మొదట్లో చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటివారు కేవలం 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే నడిచి వారి పనిని యధావిధిగా చేసుకోవచ్చు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా వాకింగ్ సమయాన్ని పెంచుతూ రావాలి. దానివల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక నేటి కాలంలో చాలా మంది బిజీ లైఫ్ కారణంగా వాకింగ్ కు వెళ్లడం పూర్తిగా మానేశారు. అలాంటివారు సాయంత్రం సమయంలో వాకింగ్ చేసినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది.
Vijayashanthi: పవన్ భార్యపై ట్రోల్స్.. విజయశాంతి ఫైర్!
ఉదయం, సాయంత్రం ఏ సమయంలో అయినా సరే వాకింగ్ కు వెళ్ళినట్లయితే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. రోజులో కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినట్లయితే చాలా మంచిది. ఇక ఉదయం పూట పరగడుపున వాకింగ్ చేసినట్లయితే ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముసలి వారు కూడా రోజులో కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినట్లయితే కీళ్ల నొప్పుల సమస్యలు తొలగిపోతాయి. నేటి కాలంలో చాలామందికి ముసలి వాళ్లు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వాతంలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు వాకింగ్ చేయడం వల్ల సమస్యలను అధిగమించవచ్చు.