Uday Kiran: ఉదయ్ కిరణ్ చనిపోతే భార్య కూడా పక్కన లేదు.. అన్ని నేనే అయ్యా..?


When Uday Kiran dies his wife is not there

Uday Kiran: ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు, ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే ఉదయ్ కిరణ్ అప్పటికే ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరినీ దాటిపోయి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఓవర్ నైట్ లోనే ఆయన పేరు ఆకాశానికి ఎక్కింది. అలా కెరియర్ లో కొనసాగుతున్న తరుణంలోనే ఒక్కసారిగా ఆయనకు అనుకోని పరిస్థితులు ఎదురై చివరికి ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఆర్థిక వ్యవహారాలని, చాలామంది అంటుంటారు.

When Uday Kiran dies his wife is not there

కానీ అది నిజం కాదట.. ఆయనకు ఆర్థికపరంగా మంచి పొజిషన్ లోనే ఉన్నారట కానీ ఆయన వెంట నా అన్న వాళ్ళు లేకపోవడం వల్లే మరణించారని ప్రముఖ ఆర్జె శేఖర్ బాషా తెలిపారు. ఉదయ్ కిరణ్ తో ఆయనకున్న ఫ్రెండ్షిప్ ను బయటపెట్టారు.. ఉదయ్ కిరణ్ మరణించే సమయంలో ఆయన వెంట ఒక్కరు కూడా లేరని, చివరికి ఒక్కడే డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుని మరణించా రని తెలియజేశాడు. అయితే ఉదయ్ కిరణ్ వరుసగా చేస్తున్న సినిమాలు ఫెయిల్యూర్ అవ్వడం డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం, సొంత భార్యతో కాస్త విభేదాలు రావడం ఉదయ్ కిరణ్ ను సతమతం చేశాయి.(Uday Kiran)

Also Read: Venu Swamy: ఆ హీరో తో పాటు సమంత సూసైడ్..ప్రభాస్ కి ప్రాణ గండం.. లీకైన వేణు స్వామి ఆడియో.?

అంతేకాదు ఈ సమయంలో ఆయనకు ధైర్యం చెప్పే వ్యక్తులు కూడా పక్కన లేకపోవడం మరో మైనస్ అయింది. ఆయన సక్సెస్ ఉన్నపుడు ఎంతో మంది ఫ్రెండ్స్ పక్కనే ఉన్నారు కానీ కాస్త ఫెయిల్యూర్ రాగానే ఎవరు కూడా పక్కన లేకుండా వెళ్ళిపోయారు. చివరికి ఆయనకు మంచి మాటలు చెప్పే వ్యక్తులు లేకపోవడం వల్ల ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించాడని శేఖర్ భాషా తెలియజేశారు. ఉదయ్ కిరణ్ మరణించి నిమ్స్ ఆస్పత్రిలో ఉన్న టైంలో కనీసం తన భార్య కూడా పక్కన లేదని, టీవీ ఛానల్ లో ఆయన ఫోటో వేసి ‘నీ స్నేహం’ అనే పాట వేయడంతో వేలాది మంది అభిమానుల ఆసుపత్రి వద్దకు చేరుకున్నారని ఆ తర్వాత కుటుంబ సభ్యులు వచ్చారని అన్నారు.

When Uday Kiran dies his wife is not there

నాలాంటి ఫ్రెండ్ ఒక్కరైనా సరే ఆయన వెంట ఉండి ఉంటే ఈరోజు ఆయన బ్రతికి ఉండేవారని తెలియజేశారు. ఉదయ్ కిరణ్ నాకు ఎఫ్ఎం రేడియోలో పరిచయమని తాను కంటిన్యూగా మారతాన్ లా ప్రోగ్రాం చేసినప్పుడు చివరి గెస్టుగా ఉదయ్ కిరణ్ వచ్చారని అన్నారు. చివరికి ఆయన మరణించిన సమయంలో ఆస్పత్రిలో కూడా తానే ఉన్నానని అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారని శేఖర్ భాష ఎమోషనల్ అయ్యారు.(Uday Kiran)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *