Chahal, Dhanashree Divorce: రూ.60 కోట్లు నొక్కేసిన చాహల్‌ భార్య ?


Chahal, Dhanashree Divorce: టీమిండియాలో మరో జంట విడిపోయింది. తాజాగా భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ఈ మేరకు నేషనల్‌ మీడియాతో కథనాలు వస్తున్నాయి. వీరి విడాకుల వార్త కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోందన్న సంగతి తెలిసిందే. భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ ఇంటర్నెట్‌లో విడాకులపై సంకేతం ఇచ్చేలా పోస్ట్‌లను చాలా సార్లు పంచుకున్నారు.

Yuzvendra Chahal, Dhanashree Verma Divorce Case

దీంతో…. వారు ఇద్దరూ విడాకుల వైపు వెళ్లినట్లు అందరికీ అర్థం అయింది. కానీ, నిర్ణయం వెనుక గల కారణాలను చెప్పడానికి భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ ముందుకు రాలేదు. కొన్ని పర్సనల్‌ కారణాల వల్లే… ఇద్దరూ విడిపోయారట. ధనశ్రీ తరఫు న్యాయవాది అదితి మోహన్ శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో కీలక వ్యాఖ్యలు చేశారట.

IPL 2025: ఐపీఎల్ 2025లో మొదటి 3 మ్యాచ్ ల షెడ్యూల్ ఇదే ?

“ప్రోసీడింగ్స్‌పై నాకు ఎటువంటి వ్యాఖ్యలు లేవు, ఈ అంశం ప్రస్తుతం సబ్ జ్యుడీస్‌లో ఉందని తెలిపారు. నేషనల్‌ మీడియా కథనాల ప్రకారం…ఈ ఇద్దరికీ దాదాపు 45 నిమిషాల పాటు కౌన్సిలింగ్‌ ఇచ్చారట. కౌన్సెలింగ్ సెషన్ తర్వాత, కూడా ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటున్నారని సమాచారం. దీంతో.. తాజాగా ఇద్దరికీ విడాకులు ఇచ్చారట న్యాయమూర్తి. అయితే… భరణం కింద రూ.60 కోట్లు ఇచ్చేందుకు చాహల్‌ ముందుకు వచ్చారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *