
CM REVANTH REDDY : తెలంగాణలో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా కేసీఆర్ ఉన్న సమయంలో ఒక విదంగా.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మరోలా ఉన్నాయని అందరూ చర్చించుకుంటున్నారు. కొందరు నేతలు కేసీఆర్ పాలన బాగుంది అంటుంటే.. మరికొందరూ రేవంత్ రెడ్డి పాలన బాగుంది అని చెప్పుకుంటున్నారు. ఎవ్వరికీ నచ్చినట్టు వాళ్లు చెబుతున్నారు. CM REVANTH REDDY
124 MAOISTS WHO ARE GOING TO SURRENDER CM REVANTH REDDY PRESS MEET TODAY
ఆ విషయాన్ని పక్కకు పెడితే ఇప్పుడు దేశవ్యాప్తంగా మావోయిస్టుల అణచివేత నడుస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఒక్క మావోయిస్టు లేకుండా చేయాలని కూంబింగ్ నిర్వహించి.. భారీ ఎన్ కౌంటర్లతో కొంత మంది మరణించడం మరికొందరూ లొంగిపోవడం చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో కొందరూ మావోయిస్టులు లొంగిపోనున్నట్టు సమాచారం. మావోయిస్టులపై ఇవాళ రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ICCC మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
Also Read : VIJAY THALAPATHY : విజయ్ దళపతికి మరో షాక్ ఇచ్చిన భార్య సంగీత
మావోయిస్టు సంబంధిత పరిణామాలపై ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పోలీస్ శాఖ అధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి సమాచార మాధ్యమాల ప్రతినిధులకు అధికారిక ఆహ్వానం పంపించారు. రాష్ట్రంలో ఇటీవల మావోయిస్టు నాయకుల లొంగుబాటు, పునరావాస చర్యలు, భద్రతా వ్యూహాలు వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ దృక్పథాన్ని వివరించనున్నారని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. మొత్తం దాదాపు 124 మంది మావోయిస్టులు ప్రభుత్వం ముందు లొంగిపోతారని సమాచారం. వీరందరూ దేవ్ జీకి చెందిన PLGA కమిటీ సభ్యులుగా తెలుస్తోంది.
Also Read : HARISH RAO : తెలంగాణ ప్రభుత్వం కేరళలో యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఫైర్..!




















