
VIJAY THALAPATHY : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి టీవీకే పార్టీ ప్రారంభించిన సమయం నుంచి ఆయనకు అన్ని చిక్కులే ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఆయన నిర్వహించిన సమావేశాల్లో రెండు సార్లు ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన పర్సనల్ లైఫ్ వివాదం కొనసాగుతోంది. ఇప్పటివరకు సినిమాలతో అలరించిన విజయ్.. ప్రస్తుతం రాజకీయాలు, వ్యక్తి జీవితంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. VIJAY THALAPATHY
VIJAY THALAPTHY WIFE SANGEETHA GAVE ANOTHER SHOCK
ముఖ్యంగా అతను నటించిన చివరి సినిమా జననాయగన్ విడుదల కాలేదు. దీంతో నిర్మాతలకు భారీగానే నష్టాలు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు విజయ్ భార్య సంగీత ఇప్పటికే విడాకులు కావాలంటూ చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించింది. ఫిబ్రవరి 24న కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఏప్రిల్ 20న ఈ కేసు విచారణ జరుగనుంది. విజయ్ భార్యకు రూ.250 కోట్లు భరణం ఇవ్వాలని యోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విజయ్ కి భార్య సంగీత మరో షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Also Read : CM CHANDRABABU-MANCHU MANOJ : సీఎం చంద్రబాబు పై మంచు మనోజ్ ప్రశంసలు.. ఎందుకోసం అంటే..?
విజయ్ దళపతి పై మరో పిటిషన్ దాఖలు చేసింది భార్య సంగీత. విడాకుల కేసు ముగిసేంత వరకు విజయ్ ఇంట్లో ఉండటానికి అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. విజయ్ కి మరో నటితో వివాహేతర సంబంధం ఉందని.. ఆమె విషయంలో తమ మధ్య విబేధాలు వచ్చాయని.. ఐదేళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నట్టు తెలిపారు. విజయ్ భార్య సంగీత ఇప్పుడు రెండో పిటిషన్ దాఖలు చేయడం మరోసారి హాట్ టాపిక్ అయింది.
Also Read : HARISH RAO : తెలంగాణ ప్రభుత్వం కేరళలో యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఫైర్..!




















