HARISH RAO : తెలంగాణ ప్రభుత్వం కేరళలో యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఫైర్..!

HARISH RAO : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం నిత్యం జ‌రుగుతూనే ఉంది. బీఆర్ఎస్ నేత‌లు తాము అధికారంలో ఉన్న‌ప్పుడు రైతుల‌కు టైమ్ ప్ర‌కారం.. రైతు బంధు ఇచ్చే వాళ్లం. యూరియా కొర‌త ఉండేది కాదు. రైతులకు స‌మ‌స్య‌లే లేకుండా ప‌రిపాలించామ‌ని చెబుతున్నారు. మ‌రోవైపు అధికార కాంగ్రెస్ నేత‌లు రైతుల‌కు రుణ‌మాఫీ చేశాం, పేద‌ల‌కు రేష‌న్ కార్డులు ఇచ్చాం, మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించామ‌ని వీళ్లు చెప్పుకుంటున్నారు.

HARISH RAO FIRE ON TELANGANA GOVERNMENT GIVING ADS IN KERALA

ఇటీవ‌లే సీఎం రేవంత్ రెడ్డి ఓ సంద‌ర్భంలో గాంధీ కుటుంబానికి రూ.1000 కోట్లు ఇవ్వాల‌ని పేర్కొన్న వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో వార్త వైర‌ల్ అవుతోంది. తెలంగాణ ప్ర‌భుత్వం కేర‌ళలో ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం పై బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రీశ్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వ నిధుల‌ను ఇత‌ర రాష్ట్రాల్లో ప్ర‌క‌ట‌న‌ల కోసం ఎందుకు ఖ‌ర్చు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ ప్ర‌జ‌ల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ప్ర‌భుత్వ నిధుల‌ను ఉప‌యోగించాల‌ని డిమాండ్ చేశారు హ‌రీశ్ రావు.

Also Read : CM REVANTH REDDY : అల్లు శిరీష్ పెళ్లికి హాజ‌రైన సీఎం రేవంత్ రెడ్డి

ఓ వైపు రాష్ట్ర ప్ర‌భుత్వ ఖ‌జానా ఖాలీ అవుతుంద‌ని దుష్ప్ర‌చారం చేస్తూనే.. మ‌రోవైపు ప‌క్కా రాష్ట్రంలో డబ్బా ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఇతర రాష్ట్రాల్లో ప్రకటనల కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Also Read : CM CHANDRABABU-MANCHU MANOJ : సీఎం చంద్ర‌బాబు పై మంచు మ‌నోజ్ ప్ర‌శంస‌లు.. ఎందుకోసం అంటే..?

Share your love