NTR: ఎన్టీఆర్ లాంటి వాడితో సినిమా చేయడం వేస్ట్.. నెట్టింట్లో మంట పెట్టిన డైరెక్టర్ మాటలు.!

Director shocking comments on NTR
Director shocking comments on NTR

NTR: జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ముందుకు వస్తారు. కానీ అలాంటిది ఓ డైరెక్టర్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడం వేస్ట్ అన్నట్లుగా మాట్లాడి సోషల్ మీడియాలో పెద్ద వార్ సృష్టించారు. మరి ఇంతకీ ఎన్టీఆర్ తో సినిమా చేయడం కష్టం అని అన్నా ఆ డైరెక్టర్ ఎవరు అనేది చూస్తే.. చిత్రం, జయం, ఔనన్నా కాదన్నా,నువ్వు నేను వంటి సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు తేజ.

Director shocking comments on NTR

ఈయన ఎంతోమంది కొత్తవారికి అవకాశం ఇవ్వడమే కాకుండా వారిని తన సినిమాలతో హీరో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే అలాంటి తేజ ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఆయన ఒక రకమైన డై లో ఉంటారు.ఇక ఎన్టీఆర్ తో చేసే బదులు బాలకృష్ణతో చేసింది బెటర్.ఆయన ఎన్టీఆర్ కంటే చాలా బెస్ట్ అంటే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.(NTR)

Also Read: Malla Reddy: పవన్ కళ్యాణ్ కి విలన్ గా మల్లారెడ్డి.. భారీ రెమ్యూనరేషన్ ఫిక్స్.. ఉస్తాద్ భగత్ సింగ్…

అయితే తేజ ఈ మాటలు మాట్లాడడంతో దీన్ని వేరే హీరోల ఫ్యాన్స్ వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో వార్ పుట్టిస్తున్నారు. కానీ తేజ అంతకుముందు మాట్లాడిన విషయాన్ని ఎవరు పరిగణలోకి తీసుకోవడం లేదు.అయితే డైరెక్టర్ తేజ ఎన్టీఆర్ మీద ఈ కామెంట్లు చేసే ముందు మీరు స్టార్ హీరోలతో సినిమాలు ఎందుకు చేయరు అని ప్రశ్న ఎదురవగా..పెద్ద హీరోలతో సినిమాలు చేసే కెపాసిటీ నా దగ్గర లేదు.అందుకోసమే వాళ్ళతో సినిమాలు చేయడం లేదు అని ఆన్సర్ ఇచ్చారు. ముఖ్యంగా మహేష్ బాబు,అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి హీరోలతో అయితే పర్వాలేదు. కానీ ఎన్టీఆర్ తో సినిమా చాలా కష్టం.

Director shocking comments on NTR

హ్యాండిల్ చేయలేను అని చెప్పారు. అయితే ఎన్టీఆర్ ని ఆయన పొగిడారు. ఎన్టీఆర్ ని డైరెక్షన్ చేసే కెపాసిటీ నా దగ్గర లేదు అని చెప్పారు. అంటే ఎన్టీఆర్ ఎం గొప్ప యాక్టరో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ విషయం తెలియక ఏదో చిన్న పాయింట్ పట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఎన్టీఆర్ పరువు తేజ తీసేసారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు.కానీ డైరెక్టర్ తేజ మాత్రం ఎన్టీఆర్ యాక్టింగ్ ని పొగిడే విధంగానే మాట్లాడారు.(NTR)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu