
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సిద్దు జొన్నలగడ్డ అంటే అభిమానులకు పెద్దగా తెలియదు. కానీ డిజె టిల్లు అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తుంది.. ఈ విధంగా పలు డిఫరెంట్ చిత్రాల్లో నటించి తన నటనాభినయంతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి ఈ యంగ్ హీరో పెళ్లి పీటలెక్కబోతున్నారట. మరి ఆ అమ్మాయి ఎవరో ఆ వివరాలు చూద్దాం..
Siddu Jonnalagadda marraige
కల్యాణం వచ్చిన కక్కొచ్చినా ఆగదంటారు పెద్దలు.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని చాలామంది యంగ్ హీరోలు ఈమధ్య పెళ్లి బాట పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ. ఈయన రష్మిక మందన్నాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అఖిల్ అక్కినేని కూడా పెళ్లి చేసుకున్నారు. ఇంకా ఈయనే కాకుండా సిద్దు జొన్నలగడ్డ కూడా పెళ్లి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. (Siddu Jonnalagadda)
Also Read: NTR: ఎన్టీఆర్ లాంటి వాడితో సినిమా చేయడం వేస్ట్.. నెట్టింట్లో మంట పెట్టిన డైరెక్టర్ మాటలు.!
ఈ విషయాన్ని సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దు ఒక స్టార్ హీరోయిన్ తో లవ్ లో ఉన్నారు. వచ్చే సంవత్సరం వీరి వివాహం జరగవచ్చని అన్నారు.. అయితే ఈయన ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయితేనే బాగుంటుందని ఎలాంటి సమస్యలు ఉండవని వ్యాఖ్యానించారు.

సిద్దుకి పెళ్లి పై ఆసక్తి పెరిగిందని చెప్పారు.ఈ విధంగా చైతన్య మాట్లాడడంతో ఆయన పెళ్లికి భాజాలు ఎప్పుడైనా మోగవచ్చని అభిమానులు సంబరపడిపోతున్నారు. మరి చూడాలి సిద్దు జొన్నలగడ్డ పెళ్లి ఈ ఏడాది జరుగుతుందా లేదా వచ్చే ఏడాది జరుగుతుందా అనేది త్వరలో బయటకు రానుంది.(Siddu Jonnalagadda)


