
Director: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ అంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు ఈయన సక్సెస్ ల మీద సక్సెస్ లు అందుకున్నారు. అలాంటి తేజ ప్రస్తుతం ఇండస్ట్రీలో కాస్త ఫేడౌట్ అయిపోయారు.. అయితే తేజ అప్పట్లో ఏ చిత్రం చేసినా ఆ సినిమాలో కొత్త హీరో లేదంటే కొత్త హీరోయిన్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన ఇండస్ట్రీకి తీసుకువచ్చిన హీరో హీరోయిన్లు ఇప్పటికే చాలామంది స్టార్లుగా మారారు. అలాంటి తేజ ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక సీక్రెట్ ను బయట పెట్టారు. అదేంటి అనే వివరాలు చూద్దాం..
Director comments on Mega Hero
తేజ మొదటిసారి డైరెక్షన్ చేసిన సినిమా చిత్రం. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఆయన టాలెంట్ ఏంటో అందరికీ తెలిసింది. ఈ సినిమా తర్వాత ఉదయ్ కిరణ్తో నువ్వు నేను సినిమా చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నితిన్ తో జయం సినిమా చేశారు. ఇలా తేజ లవ్ స్టోరిలను తీసుకొని అద్భుతంగా తెరకెక్కించారని చెప్పవచ్చు. అలాంటి తేజ ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్,కాజల్ అగర్వాల్, నందిత వంటి స్టార్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు చాలా వెనుకబడిపోయిన తేజ నేనే రాజు నేనే మంత్రి మూవీతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు . (Director)
Also Read: ఏడేళ్ల కృషికి ఫలితం ‘అరి’ – దర్శకుడి శ్రమను ప్రశంసించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కానీ ఈ మధ్యకాలంలో అహింసా చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. తేజ గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మురళీమోహన్ రామ్ చరణ్ గురించి తెలియజేశారు. మహేష్ బాబు తో నిజం సినిమా షూటింగ్ సమయంలో తన తండ్రి క్యారెక్టర్ ను సీనియర్ నటుడు మురళీమోహన్ తో షూట్ చేశారట. కానీ మహేష్ బాబుకు మురళీమోహన్ తండ్రిగా పెద్దగా సెట్ కాలేదని ఆయన్ని పక్కన పెట్టారట. దీంతో మురళీమోహన్ కోపానికి వచ్చి మీ వల్ల నేను వేరే సినిమాలో డేట్స్ వదిలేసాను.

నాకు ఈ చిత్రం నుంచి తీసేసినందుకు కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరారట. చివరికి ఆ ఇచ్చిన నష్టపరిహారాన్ని తనకు కాకుండా ఒక గుడికి విరాళంగా ఇవ్వాలని చెప్పారట. దీంతో ఆ అమౌంట్ గుడికి చెల్లించారు. కానీ ఈ సమయంలోనే ఈ డబ్బు నా ద్వారా గుడికి విరాళంగా వెళితే రామ్ చరణ్ గుడికి విరాళం ఇచ్చారని ప్రచారం చేసుకున్నారని తేజ చెప్పుకోచ్చారు. కానీ ఈ విషయాన్ని అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదని ఆయన అన్నారు.(Director)





