
Narne Nithiin: ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ లోని యంగ్ హీరోలంతా పెళ్లి బాట పడుతున్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం మరవకముందే మరో హీరో మూడుముళ్ల బంధంతో ఓ ఇంటి వాడయ్యాడు. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్. ఈ మధ్యకాలంలో వరుసగా సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే తాజాగా నార్నె నితిన్ శివాని అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు.
Did you know that the girl Narne Nithiin married is the hero younger sister
అయితే నితిన్ చేసుకున్న అమ్మాయి దగ్గుబాటి ఫ్యామిలీకి చాలా దగ్గరట. అంతేకాదు స్టార్ హీరో రానాకి దగ్గరి బంధువు అని తెలుస్తోంది. మరి రానాకి ఏమవుతుంది అనే వివరాలు చూద్దాం.. గత సంవత్సరం నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి నితిన్ తాజాగా పెళ్లి ద్వారా ఒక్కటైపోయారు. బావమరిది వివాహం కాబట్టి ఎన్టీఆర్ అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు. తన షూటింగుకు బ్రేక్ ఇచ్చి మరరీ పనులన్నీ చక్కబెట్టారు. (Narne Nithiin)
Also Read: Sandeep Reddy Vanga: సినీ కెరీర్ లో ఫస్ట్ టైం సందీప్ రెడ్డి వంగా ఈగోని హార్ట్ చేసిన…
ఇందులో ఎన్టీఆర్ తన సతీమణి ప్రణతితో మ్యాచింగ్ కాస్ట్యూమ్స్ తో అదరగొట్టేశారు. ఇందులో ఎన్టీఆర్ క్రీమ్ కలర్ కుర్తా ధరించగా.. ప్రణతి కూడా క్రీం కలర్ సారీ ధరించి అద్భుతమైన డైమండ్ హారం తో మెరిసిపోయింది. హైదరాబాద్ శివారులోని శంకర్పల్లిలో జరిగినటువంటి ఈ వివాహ వేడుకకు చాలామంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఇందులో ముఖ్యంగా దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం పెళ్లికి హాజరైంది. వెంకటేష్ దంపతులు, సురేష్ బాబు దంపతులు, నాగచైతన్య, తల్లి లక్ష్మి,రానా, మిహికా దంపతులు ఇలా దగ్గుబాటి కుటుంబమంతా శివాని పెళ్లిలో మెరిసింది.

మరి వీళ్లంతా ఆ పెళ్లికి ఎందుకు వచ్చారంటే శివాని వీరికి చాలా దగ్గర బందువట. ముఖ్యంగా దివంగత రామానాయుడు కి శివాని మనవరాలు అవుతుందట. అంటే వెంకటేష్ సురేష్ బాబు లకు కూతురు అవుతుంది. అయితే రానాకు ఈమె చెల్లెలు అవుతుందని తెలుస్తోంది.. అయితే శివాని తండ్రి కృష్ణ ప్రసాద్ నెల్లూరులో పుట్టి వ్యాపారాల రీత్యా హైదరాబాదులో సెటిల్ అయ్యారు.. అయితే వీళ్ళు పూర్వకాలం నుంచి దగ్గరి బంధువులు. ప్రస్తుతం రానాకు శివాని చెల్లెలు అవుతుందని తెలియడంతో రానా ఎన్టీఆర్ కి తమ్ముడు అవుతారని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.(Narne Nithiin)




















