Vijay Deverakonda: ఆ సినిమా టైమ్ లోనే రష్మికకు నాకు పెళ్ళైంది.. సీక్రెట్ బయటపెట్టిన విజయ్ దేవరకొండ.!

Vijay Deverakonda revealed the secret that he got married to Rashmika during that movie

Vijay Deverakonda: రష్మిక విజయ్ దేవరకొండలు గత వారం రోజుల నుండి ఎంగేజ్మెంట్ వార్తలతో సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. అంతే కాదు ఎంగేజ్మెంట్ విషయాన్ని ఇప్పటివరకు బయట పెట్టకపోయినప్పటికీ విజయ్ ఆ తర్వాత పుట్టపర్తి సత్య సాయిబాబా సమాధి దర్శించుకోవడానికి వెళ్లిన సమయంలో ఆయన ఎంగేజ్మెంట్ రింగుతో అడ్డంగా దొరికిపోయారు.

Vijay Deverakonda revealed the secret that he got married to Rashmika during that movie

అలా ఎంగేజ్మెంట్ వార్తలతో సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్న ఈ జంటకు సంబంధించి తాజాగా ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే రష్మికకు నాకు ఆ సినిమా టైం లోనే పెళ్లయింది అంటూ విజయ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ విజయ్ ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు.. ఇప్పటికే రష్మిక విజయ్ ల పెళ్లి జరిగిపోయిందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.(Vijay Deverakonda)

Also Read: Trisha: ఫైనల్ గా చండీగర్ కుర్రాడితో త్రిష పెళ్లి.. బ్యాగ్రౌండ్ వెరీ రిచ్.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్.!

రష్మిక విజయ్ ల పెళ్లి జరిగిపోయింది అని విజయ్ చెప్పింది ఓ సినిమా గురించి. ఇక వీరిద్దరూ కలిసి నటించిన గీత గోవిందం సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమా చివర్లో రష్మిక విజయ్ ల పెళ్లి జరుగుతుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ గురించి విజయ్ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. గీత గోవిందం సినిమాలో క్లైమాక్స్లో పెళ్లి సీన్ వరకు ఓకే గాని పీటల మీద కూర్చొని అదంతా చేసే సమయంలో కాస్త నర్వస్ గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే రష్మిక పెళ్లికూతురు గెటప్ లో కూర్చొని ఆమె మెడలో నేను తాళికట్టే సీన్ చేస్తున్నప్పుడు వామ్మో అని అనుకున్నాను.

Vijay Deverakonda revealed the secret that he got married to Rashmika during that movie

ఇదే నా ఫస్ట్ పెళ్లి షూట్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విజయ్ దేవరకొండ. అలా తనకు మొదట పెళ్లి చేసుకున్న అనుభూతి గీత గోవిందం సినిమా క్లైమాక్స్ లో ఎదురైంది అంటూ విజయ్ మాట్లాడిన వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది రనెటిజన్స్ ఆ సినిమాతోనే కదా మీరు రియల్ లైఫ్ లో పెళ్లి వరకు వెళ్లారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Vijay Deverakonda)

Share your love