
Balakrishna: బాలకృష్ణ రాజకీయాల్లో సినిమాల్లో రారాజుగా రాణిస్తున్నారు.వేలకోట్ల ఆస్తులు సంపాదించారు. తండ్రి వారసత్వంతో పాటు ఆయన సినిమాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కానీ ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం ఆయనని ఆ బాధ మాత్రం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందట. మరి ఇంతకీ బాలకృష్ణని జీవితాంతం వెంటాడే ఆ బాధ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ, వసుంధరా దేవిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
The thing that will haunt Balakrishna for the rest of his life
అయితే ఈ పెళ్లి పెద్దల అభిప్రాయం ప్రకారమే జరిగింది.పెద్దల కుదిర్చిన పెళ్లి.కానీ ఈ పెళ్లికి బాలకృష్ణ కన్నతండ్రి సీనియర్ ఎన్టీఆర్ లేకపోవడం, హరికృష్ణ రాకపోవడం ఆయన్ని జీవితాంతం వెంటాడే ఒక బాధ నట.అయితే ఈ విషయాన్ని బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ నేను పెళ్లి చేసుకున్న సమయంలో నాన్న అన్న రాలేకపోయారు.. (Balakrishna)
Also Read: Hero: డూప్ లేకుండా సినిమాలు.. 119 కుట్లు వేయించుకున్న హీరో..!
ఈ రెండు విషయాలు నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఎన్ని ఉన్నా కూడా నా పెళ్లి సమయంలో నాన్న,అన్నా లేకపోయారే అనే బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంది. ఇదొక్కటే నన్ను జీవితంలో చాలా బాధ పెట్టింది అంటూ కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేశారు బాలకృష్ణ. అయితే బాలకృష్ణ పెళ్లికి సీనియర్ ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం అప్పుడే ఆయన రాజకీయాల్లో తిరుగుతున్నారు.

టిడిపి పార్టీని స్థాపించి పార్టీని రాష్ట్రం మొత్తం లో ఉన్న ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం కోసం ఊరురా తిరుగుతున్నారు.ఆ సమయంలోనే బాలకృష్ణ పెళ్లయింది. అలా ఎన్టీఆర్ రాలేకపోయారు. ఇక హరికృష్ణ కూడా ఎన్టీఆర్ కి రైట్ హ్యాండ్ లా ఉండి నాన్న వెంటే ఉన్నారు కాబట్టి ఆయన కూడా పెళ్లికి రాలేకపోయారు.(Balakrishna)




















