Balakrishna: “నేను డూప్లికేట్ హీరోని కాదు”.. బాలకృష్ణ సెటైర్లు ఆ హీరో పైనేనా.?

I am not a duplicate hero Are Balakrishna satires on that hero

Balakrishna: నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంతే కాదు ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో ఇండస్ట్రీ ఒక పెద్ద ఈవెంట్ చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనకు మరో అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే.. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ఈయనకు సన్మానం చేశారు. ఈ వేడుకకి దేశం నలుమూలల నుండి ఎంతోమంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వచ్చారు.

I am not a duplicate hero Are Balakrishna satires on that hero

గోవాలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలకృష్ణని సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను డూప్లికేట్ యాక్టర్ ని కాదు అంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.ఇక ఆ ఈవెంట్లో బాలకృష్ణ ఏం మాట్లాడారంటే.. సినిమా ఇండస్ట్రీలో నేను 50 ఏళ్లుగా కొనసాగుతున్నాను. ఎన్టీఆర్ కి కొడుకు అవ్వడం వల్ల నాకు ఈ సక్సెస్ సాధ్యం కాలేదు.ఆ లెగసీని ఇండస్ట్రీలో కొనసాగించడంతోపాటు సినిమాలపై నాకున్న నాలెడ్జి వల్లే ఇదంతా సాధ్యమైంది. (Balakrishna)

Also Read: Akkineni Amala: ఆ మాయదారి వల్లే ఇదంతా.. ఎమోషనల్ అయినా అక్కినేని అమల.!

ఇప్పుడు సినిమా మేకింగ్ పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సినిమాల్లో టెక్నాలజీ డామినేషన్ ఎక్కువైంది. ప్రతి సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ వాడుతున్నారు. కానీ నేను అలా కాదు. నేను ఎంచుకునే కథలు ఎప్పటికీ ప్రేక్షకుల్లో ఉండాలని ఎంచుకుంటాను. నేను నటించే సినిమాలో కేవలం అవసరమున్న చోట మాత్రమే విజువల్ ఎఫెక్ట్స్ పెడతారు. కానీ ఇప్పుడు కొంతమంది హీరోలు కేవలం గ్రీన్ మ్యాట్ ల మధ్య నటించి షూటింగ్ నుండి వెళ్ళిపోతున్నారు.

I am not a duplicate hero Are Balakrishna satires on that hero

ప్రతి దానికి విజువల్ ఎఫెక్ట్స్ వాడుతూ అసలు హీరో షూటింగ్ కి రావాల్సిన అవసరమే లేకుండా పోతుంది. కానీ నేను అలా డూప్లికేట్ యాక్టర్ ని కాదు ఒరిజినల్ యాక్టర్ ని అంటూ మాట్లాడారు. అయితే బాలకృష్ణ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది జనాలు కొంతమంది హీరోలను టార్గెట్ చేసి బాలకృష్ణ ఇలా మాట్లాడారని, ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు తమ సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ పెట్టుకుంటున్నారని అందుకే వారిని ఉద్దేశించే బాలకృష్ణ ఈ కామెంట్లు చేశారని అనుకుంటున్నారు.(Balakrishna)

Share your love