Jubilee Hills Bypoll: కేసీఆర్ కు కొత్త టెన్ష‌న్‌…జూబ్లీహిల్స్‌లో ‘కారు’ను పోలిన ఫ్రీ సింబల్స్ ?

Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ అకాల మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ ఉప ఎన్నిక నవంబర్ 11వ తేదీన నిర్వహించనున్నారు. నవంబర్ 14వ తేదీన ఎన్నిక ఫలితం వెలువడుతుంది. గులాబీ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు రెండుసార్లు ఓడిపోయిన నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. Jubilee Hills Bypoll

Jubilee Hills Bypoll Free symbols resembling car in Jubilee Hills

అయితే ప్రచారంలో జోరు మీద ఉన్న గులాబీ పార్టీకి ఎన్నికల గుర్తులు టెన్షన్ పడుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఫ్రీ సింబల్స్ తో తిప్పలు తప్పడం లేదు. గతంలో కూడా చాలా నియోజకవర్గాలలో ఈ ప్రీ సింబల్స్ కారణంగా గులాబీ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్ అలాగే చపాతీ రోలర్ లాంటి గుర్తులు గతంలో కేసీఆర్ పార్టీకి తీవ్ర నష్టం చేశాయి. కారు గుర్తు లాగే ఈ గుర్తులు ఉండడంతో చాలామంది వాటికి ఓటు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కూడా ఈ గుర్తులు ఉండనున్నాయి. దీంతో గులాబీ పార్టీ నేతలు కాస్త టెన్షన్ పడుతున్నారు.Jubilee Hills Bypoll

Also Read: Green chilies: పచ్చిమిరపకాయలు తింటున్నారా.. అయితే 100 రోగాల‌కు చెక్ ?

ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు రోడ్డు రోలర్ తో పాటు చపాతి రోలర్ గుర్తులు ఇవ్వకూడదని గతంలో కూడా గులాబీ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ గులాబీ పార్టీకి న్యాయం జరగలేదు. ఈ గుర్తులు ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రచారంలో గులాబీ పార్టీ కొత్త అడుగులు వేయాల్సి ఉంటుంది. ప్రతి ఓటర్ కు బ్యాలెట్ లోని కారు గుర్తును క్లారిటీగా ప్రచారం చేయాలి. అప్పుడే గులాబీ పార్టీ సక్సెస్ అవుతుంది. లేకపోతే ఓటర్ కన్ఫ్యూజ్ అయి కారు గుర్తుకు చేయబోయి మరో గుర్తుకు వేసే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి గులాబీ పార్టీ దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చాలా సర్వేల్లో గులాబీ పార్టీ విజయం సాధిస్తుందని తేల్చిన సంగతి తెలిసిందే. Jubilee Hills Bypoll

Also Read: Kurnool Bus Accident: కర్నూల్ బస్సు ప్రమాదంలో సంచ‌ల‌నం..234 కొత్త ఫోన్లే కొంప‌ముంచాయా ?