Jubilee Hills bypoll: మాగంటి గోపీనాథ్ కు అసలైన వారసులం మేమే..కాంగ్రెస్ స్కెచ్ అదుర్స్ ?

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 11వ తేదీన అంటే మరో నాలుగు రోజుల్లోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 14వ తేదీన ఈ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ఉంటుంది. గులాబీ పార్టీ తరఫున మాగంటి సునీత పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన సర్వేల ప్రకారం గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని జోరుగా ప్రచారమైతే సాగుతోంది. Jubilee Hills bypoll

Jubilee Hills bypoll The true heir of Maganti Gopinath

అయితే ఇలాంటి నేపథ్యంలో మాగంటి కొడుకు అంటూ తారక్ అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. మాగంటి గోపీనాథ్ అసలు సిసలు వారసులం మేమే అంటూ సంచలన ప్రెస్ మీట్ పెట్టాడు. మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకే ఈ తారకట. రాజకీయ మాస్తుల కోసం తాను రాలేదని.. ఎవరి కొడుకు అని అడిగితే నేనేం చెప్పుకోవాలి అంటూ ఎమోషనల్ అయ్యాడు తారక్. నా తండ్రి మరణించే వరకు నేను ఆయనతో టచ్ లోనే ఉన్నానని పేర్కొన్నారు. Jubilee Hills bypoll

Also Read: Jubilee Hills Bypoll: బీజేపీలో గులాబీ పార్టీ విలీనం.. రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్?

అంత్యక్రియలకు రాకుండా మమ్మల్ని బెదిరించారని ఫైర్ అయ్యారు. ఇక్కడికి వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని.. ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయవద్దని పువ్వాడ అజయ్ అలాగే మోహన్ ముల్లపూడి తనకు చెప్పినట్లు తెలిపారు. తనకు హాని ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని తారక్ వెల్లడించారు. నామినేషన్ల సమయం లోనే మాగంటి సునీత పై ఫిర్యాదు చేశాడు తారక్. కానీ అధికారిక లెక్కల ప్రకారం తారక్ వాదన చెల్లదని ఎన్నికల అధికారులు కూడా.. మాగంటి సునీతకు క్లీన్ చీట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు గులాబీ పార్టీ గెలుస్తుంది అని సర్వేలు బయటకు రావడంతో.. కాంగ్రెస్ కొత్త కుట్రలకు తెర లేపుతోందని కేటీఆర్ కౌంటర్ ఇస్తోంది. Jubilee Hills bypoll

Also Read: Jubilee Hills Bypoll: కేసీఆర్ సంచ‌ల‌న ప్రెస్ మీట్‌..ఇక కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా…

Share your love