
Ram Pothineni: రామ్ పోతినేని గత కొద్ది రోజులుగా నటి భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమలో ఉన్నారనే ప్రచారం టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రామ్ పోతినేని భాగ్యశ్రీ బోర్సేల ప్రేమాయణం గురించి కుప్పలు తెప్పలుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సందర్భంలో తాజాగా భాగ్యశ్రీ బోర్సేతో ఉన్న ప్రేమ గురించి క్లారిటీ ఇచ్చారు రామ్ పోతినేని.
Ram Pothineni Bhagya shri borse love
ప్రస్తుతం రామ్ పోతినేని నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా అనే మూవీ నవంబర్ 27న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ పోతినేని కి భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమ గురించి ఓ ప్రశ్న ఎదురైంది.అయితే ఈ ప్రశ్న గురించి రామ్ పోతినేని స్పందిస్తూ.. నాకు భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమాయణం ఉంది అనే వార్తలు అవాస్తవం.నేను ఆమెను ప్రేమించడం లేదు. మా ఇద్దరి మధ్య అసలు లవ్ అనేదే లేదు.(Ram Pothineni)
Also Read: Varanasi: రాజమౌళి మహేష్ కాదు.. వారణాసి ఈవెంట్ మొత్తం ఆ డైరెక్టర్ జపమే చేసిందిగా..!
కేవలం ఇది ఎవరో పుట్టించిన పుకారు మాత్రమే. అలాగే నేను రాసిన పాట భాగ్యశ్రీని ఉద్దేశించే రాసానని కూడా అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు.ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ ఫిక్స్ అవ్వడం కంటే ముందే నేను ఈ సినిమా కోసం పాట రాశాను.సో భాగ్యశ్రీ తో ప్రేమలో పడడం వలే ఈ పాట రాశాను అనడంలో ఎలాంటి నిజం లేదు.

కేవలం సినిమాలో హీరోయిన్ మట్టుకే ఆమెతో సంబంధం ఉంది. కానీ బయట భాగ్య శ్రీ తో నాకు ఎలాంటి విషయం లేదు అంటూ పిచ్చ క్లారిటీ ఇచ్చేశారు రామ్ పోతినేని. అయితే రామ్ పోతినేని కామెంట్స్ తో చాలామంది ఆయన అభిమానులు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు నాయనా..ముసలోడివి అయిపోతున్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Ram Pothineni)




















