
Ibomma Ravi: ఐబొమ్మ రవి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈయన పేరే వినిపిస్తోంది.అరెస్టు చేసి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో చాలామంది చాలా రకాలుగా ఈయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే పనిలో పడుతున్నారు. ముఖ్యంగా మీడియా వాళ్ళు ఐబొమ్మ రవి బ్యాగ్రౌండ్ ఏంటి? ఆయన ఎక్కడ ఉండే వారు.. ఆయన తల్లిదండ్రులు ఎవరు అని తెలుసుకునే పనిలో పడ్డారు..
Sensational facts revealed by father about Ibomma Ravi
ఇందులో భాగంగా ఐ బొమ్మ రవిని కొంతమంది మీడియా వాళ్ళు ప్రశ్నించగా సంచలన విషయాలు బయట పెట్టారు. ముఖ్యంగా రవి తండ్రి దగ్గరికి మీడియా వాళ్ళు వెళ్లి అడగగా అసలు రవి ఇలాంటి పని చేస్తున్నాడనే సంగతి నాకు తెలియదు. కానీ చట్టం ముందు ఎవరైనా ఒకటే..ఇన్ని వార్తలు వింటూ ఉంటే నా కొడుకు తప్పు చేసినట్టే అర్థమవుతుంది. వాడికి తగిన బుద్ధి చెప్పండి అన్నట్లుగా మాట్లాడారు. (Ibomma Ravi)
Also Read: Ibomma Ravi: ‘ఏం పీకలేవ్’.. అత్త భార్య కలిసి చేసిన ఛీత్కారాలే ఐబొమ్మ రవిని ఇలా మార్చాయా.?
అలాగే ఎన్ని డబ్బులు సంపాదించినా కూడా అవేవీ నాకు తెలియదని, భార్యతో కలిసి ఉండడం లేదని,ఇంటికి వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తన కొడుకుకి ఈ క్రిమినల్ మైండ్ రావడానికి కారణం తన భార్యనే..మా వంశంలో ఎవరికి కూడా ఇలాంటి మైండ్ లేదని,నా భార్యకి ఉన్న క్రిమినల్ మైండే నా కొడుకుకి కూడా వచ్చిందని, ఆమె ఎప్పుడూ కూడా క్రిమినల్ గా ఆలోచించేదని,తప్పుడు మార్గం లోనే వెళ్లేదని పర్సనల్ విషయాలను బయటపెట్టాడు.

అంతేకాదు తన భార్యకి ఉన్న చెడు బుద్ధి తన కొడుకుకు వచ్చి ఇలా పాడయ్యాడని, ఆమెకు ఉన్న వక్రబుద్ధి కారణంగానే నేను దూరం పెట్టానని,నా కొడుకు ఇలా తయారవ్వడానికి కారణం వాడి తల్లే అంటూ సంచలన విషయాలు బయటపెట్టారు ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు. అంతేకాదు నా కొడుకు కోట్లు సంపాదించినా కనీసం తినడానికి నాకు తిండి కూడా లేదని, వాడికి ఎలాంటి చెడు వ్యసనాలు కూడా లేవు అంటూ చెప్పుకొచ్చారు. అలా ఫైనల్ గా ఇమ్మాడి రవి కేసు ఎటేటో తిరుగుతూ చివరికి వారి వ్యక్తిగత విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.(Ibomma Ravi)




Ibomma Ravi:”అమీర్పేట్ లో కలిసిన మాయలాడి” వల్లే ఐబొమ్మ రవికి ఈ గతి పట్టిందా.!