జాతీయ పురస్కారాల్లో మెరిసిన “బేబి”

క్లాసిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బేబి సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. నేడు ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో ఈ చిత్రానికి రెండు పురస్కారాలు దక్కాయి. హార్ట్ టచింగ్ కథనాన్ని రాసిన సాయి రాజేశ్ కు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా, మనసును కదిలించేలా ప్రేమిస్తున్నా పాట పాడిన సింగర్ పీవీఎన్ ఎస్ రోహిత్ కు బెస్ట్ బ్లే బ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డ్స్ దక్కాయి. ఇప్పటికే ప్రైవేట్ సంస్థలు ఇచ్చే ఎన్నో ప్రెస్టీజియస్ అవార్డ్స్ గెల్చుకున్న బేబి సినిమాకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ అవార్డ్స్ దక్కడం సరైన గౌరవంగా భావించవచ్చు.

బేబి సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ముఖ్య పాత్రల్లో నటించారు. వీళ్ల అందరి కెరీర్ లకు బేబి సినిమా విజయం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించిన ఎస్ కేఎన్ కల్ట్ ప్రొడ్యూసర్ గా మారారు. బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లు అందుకున్న బేబి సినిమా టాలీవుడ్ లో ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. త్వరలో హిందీ ప్రేక్షకుల ముందుకు కూడా “బేబి” సినిమా రీమేక్ గా రాబోతోంది.

Share your love