“ఓజీ” సాంగ్ లీక్ పై తమన్ ఆడియో వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబర్ 25న థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ బిగిన్ చేస్తున్నారు. ఫస్ట్ సాంగ్ కు అంతా రెడీ అవుతున్న టైమ్ లో సాంగ్ సోషల్ మీడియాలో లీక్ అయ్యిందంటూ డైరెక్టర్ సుజీత్ కు కాల్ చేసి చెప్పారు తమన్. ఈ ఫోన్ కాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సాంగ్ లీక్ నిజంగా జరగలేదు.

డైరెక్టర్ సుజీత్ కు ఫ్రాంక్ కాల్ చేశాడు తమన్. గతంలో తమన్ మ్యూజిక్ చేసిన గేమ్ ఛేంజర్ లాంటి చిత్రాల్లో నుంచి పాటలు లీక్ అయ్యాయి. అందుకే ఓజీ సాంగ్ లీక్ అయ్యిందనే విషయాన్ని డైరెక్టర్ సుజీత్ ఈజీగా నమ్మాడు. హంగ్రీ చీతా అనే ఈ పాటను తమిళ హీరో శింబు పాడారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఓజీ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu