హీరో కిరణ్ అబ్బవరం ఆయన సతీమణి రహస్య అబ్బవరం తమ అబ్బాయికి హను అనే పేరు పెట్టారు. హను నామకరణ కార్యక్రమాన్ని తిరుమల వెంకటేశ్వరుడి ఆలయంలో జరిపించారు. ఆంజనేయస్వామి, వెంకటేశ్వరుడి ఆశీస్సులు ఉండేలా హను అనే పేరును పెట్టామని, నామకరణ వేడుక తిరుపతిలో చేశామని కిరణ్ అబ్బవరం తెలిపారు. చిన్నారి హను క్యూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరోవైపు కిరణ్ అబ్బవరం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ లో ఉండగా, కె ర్యాంప్ సినిమా ఈ దీపావళికి రిలీజ్ కు రెడీ అవుతోంది. మరో కొత్త చిత్రాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తున్నట్లు కిరణ్ అబ్బవరం తెలిపారు. క సినిమా సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం కెరీర్ వేగం పుంజుకుంది. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగిస్తున్నాయి.





