విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కింగ్డమ్ హిస్టారికల్ బాక్సాఫీస్ రన్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమా 4 రోజుల్లో 82 కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకుంది. వంద కోట్ల రూపాయల మార్క్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. రేపటికి 100 కోట్ల మార్క్ ను సినిమా రీచ్ కానుంది. రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ అన్ని ఏరియాల్లో స్ట్రాంగ్ కలెక్షన్స్ తో కింగ్డమ్ సత్తా చాటుతోంది.
సినిమా బాగుంటే ప్రేక్షకులు భారీ వసూళ్లు అందిస్తారని ప్రూవ్ చేస్తోంది కింగ్డమ్ సినిమా. టీమ్ పడిన కష్టానికి ఈ సినిమా విజయం మంచి రిజల్ట్ ఇచ్చింది. ఓవర్సీస్ మార్కెట్ లోనూ కింగ్డమ్ వసూళ్ల జోరు చూపిస్తోంది. తెలుగు సినిమాకు మెయిన్ మార్కెట్ అయిన నార్త్ అమెరికాలో ఈ సినిమా 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసి..2 మిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తోంది.





