3 రోజుల్లో రూ.67 కోట్లు, బాక్సాఫీస్ పై “కింగ్డమ్” దండయాత్ర

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “కింగ్డమ్” సినిమా టాలీవుడ్ లో రీసెంట్ సెన్సేషన్ గా మారింది. ఈ సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది. కేవలం 3 రోజుల్లోనే ఈ చిత్రానికి 67 కోట్ల రూపాయల వసూళ్లు రావడం విశేషం. ఇదే జోరు కొనసాగితే కింగ్డమ్ సినిమా త్వరలోనే వంద కోట్ల మార్క్ చేరుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. నిర్మాత నాగవంశీ చెప్పినట్లు 3 రోజుల్లోనే కింగ్డమ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు రీచ్ అవుతోంది.

సినిమా బాగుందనే టాక్ తో థియేటర్స్ కు క్యూ కడుతున్నారు ఆడియెన్స్. పెద్ద సంఖ్యలో ఆన్ లైన్ బుకింగ్స్ తో పాటు ఆఫ్ లైన్ లో టికెట్ సేల్స్ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బీ, సీ సెంటర్స్ వద్ద కూడా కింగ్డమ్ దూసుకెళ్తోంది. ఈ ఫస్ట్ వీక్ లో వస్తున్న హాలీడేస్ కూడా కింగ్డమ్ కు బాగా కలిసిరానున్నాయి. ఈ వీకెండ్ తో పాటు హాలీడేస్ లో కలెక్షన్స్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తాయని అనుకోవచ్చు. మరోవైపు ఓవర్సీస్ లో కూడా కింగ్డమ్ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నార్త్ ఆమెరికన్ బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ క్రాస్ చేసి దూసుకెళ్తోంది.

Share your love