డే 1 వసూళ్లలో “కింగ్డమ్” సెన్సేషన్

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా డే 1 వసూళ్లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 39 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. విజయ్ దేవరకొండ రేంజ్ హీరోలతో చూస్తే డే 1 వసూళ్లలో ఇదొక హ్యూజ్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ రోజు నుంచి కింగ్డమ్ వసూళ్లు మరింతగా పెరగనున్నాయి.

వీకెండ్ వస్తుండటం కూడా వసూళ్లలో భారీ పెరుగుదలను నమోదు చేసే అవకాశం ఉంది. నిన్న ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ మూడు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పారు. మరోవైపు నార్త్ అమెరికన్ బాక్సాఫీస్ వద్ద కూడా కింగ్డమ్ జోరు చూపిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 1 మిలియన్ ఫ్లస్ గ్రాస్ వసూళ్లు దాటేసింది. ఈ నెంబర్స్ చూస్తుంటే విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా కింగ్డమ్ నిలవనుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_